|
|
Articles: Short Stories | బ్రహ్మచారి బాగోతం - Mr. Pratap Cherukuri Pratap
| |
బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికిరాదంటారు కదా! శోభనరావు చూస్తుండగానే ముప్పై అయిదు ఏళ్లు దాటేసాడు. ముఖం లో ఇంతకు ముందు వున్న కళ కుడా తగ్గిపోయింది. మధ్యలో జుత్తు వూడిపోయి, వున్న కాస్త జుత్తు పండిపోయి, బొజ్జ బాగా పెద్దదైపోయి జోకర్ లా తయారయ్యాడు. ఆఫీసులో అందరూ అతనిని పెళ్ళి కాని ప్రసాద్ అని ముద్దుగా పిలవడం మొదలెట్టారు. పదహారు, పద్ధెనిమిదేళ్ళ ఆడపిల్లలు మన హీరోని అంకుల్ అని సంబోధిస్తే, స్నేహితులు యవ్వనాన్ని వృధా చేసుకున్న వేస్ట్ ఫెలో అని, చుట్టరికాలలో ఏదో లోపం వుండడం వలన అది డాక్టర్ సమరం వంటి ఉద్దండ పండితుల వలన కూడా నయం కాని కారణం గా పెళ్ళికి పనికి రాక, ఇలా పాటలు పాడే అమ్మాయి కావాలన్న సాకుతో సంబంధాలను తిరగొట్టేస్తున్నాడన్న సంశయం తో చెవులు కొరుక్కోవడమే కాక, పెళ్ళిళ్ళు, పేరంటాలకు శోభనరావు గానీ వారి తల్లిదండ్రుల గానీ వచ్చినప్పుడు ఎక్కడ తమ అమ్మాయిలను చూస్తారోనని దాచెయ్యడం వంటివి బహిరంగం గా చేయసాగారు.
జరుగుతున్న తంతుకు శోభనరావు తల్లిదండ్రులకు ఎవ్వరికీ ముఖం చూపించలేని పరిస్థితి రాగా మన శోభనరావు మాత్రం ఏనాటికైనా పాటలు బాగా పాడగల అమ్మాయే తనకు భార్యగా వస్తుందని, వెన్నెల రాత్రులలో డాబాపై మంచం మీద భార్య ఒడిలో పడుకొని ఆమె చల్లని రేయి గురించి పాటలు పాడుతుండగా ఆనందిస్తూ నిద్రలోకి జారుకోవాలని కలలు కంటూనే వున్నాడు.
ఆ రోజు ఎంతో శుభదినం. మన శోభనరావుకు వందవ పెళ్ళిచూపులు. టి వి లో మన క్రికెటర్లు సెంచురీ చేస్తే ఎంతో ఆనందించే శోభనరావు తల్లిదండ్రులకు మాత్రం తమ సుపుత్రుడు పెళ్ళిచూపులలో సెంచురీ చేయడం ఏ మాత్రం రుచించ లేదు. కానీ ఏం చేస్తారు? ఆత్మ హత్య చేసుకుంటామని బెదిరించినా ఏ మాత్రం చలించని మొండి ఘటం తమ సుపుత్రుడు. ఎనభై ఏళ్ళకైనా పాటలు పాడే అమ్మాయినే పెళ్ళి చేసుకుంటానని భీష్మ ప్రతిజ్ఞ చేసిన మగ ధీరుడు.
ఈ సంబంధం కోసం పెళ్ళిళ్ళ పేరయ్య బ్రహ్మానందాన్ని ఎంత బతిమిలాడారో వాళ్ళకే ఎరుక. చివరకు కాళ్ళు పట్టుకొని సంభావన భారీగా ఇస్తామని కమిట్ అయితేనే ఈ పెళ్ళిచూపులను ఏర్పాటు చేసాడు పేరయ్య బ్రహ్మానందం. అయితే ఇక్కడ వచ్చిన చిక్కేమిటంటే ఈ అమ్మాయికి కూడా పాటలు పాడడం రాదు. కానీ ఒక మోస్తరు అందంగా వున్నా మంచి కళ గా వున్న ముఖం. మంచి సుగుణాలు వున్నాయి , చక్కని ఫామిలీ బాక్ గ్రౌండ్ వుంది. అల్లు రామలింగయ్య పెర్సనాలిటీ లో కొచ్చి ఇప్పటి వరకూ ఒక్క శోభనానికైనా నోచుకోని మన శోభనరావుకు ఇంతకంటే మంచి సంబంధం ఇక ఈ జన్మలో రాదు. అందుకే ఈ సంబంధం ఎలాగైనా ఒకే చెయ్యాలన్న కృత నిశ్చయం తో వున్నారు వారు. బ్రహ్మానందం తమ్ముడైన ఐరెన్ లెగ్ శాస్త్రి శోభనరావు కధ అంతా విని ఒక మంచి ఐడియా ఇచ్చాడు. ఇక ఈ ఐడియా మన శోభనరావు జీవితాన్ని ఎలా మార్చేసిందో చూద్దాం.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|