|
|
Articles: Short Stories | మేకవన్నె పులి - Mr. Pratap Cherukuri Pratap
| |
'ఒరేయ్ కిరణ్. నన్నెంత తక్కువగా అంచనా వేసావురా? నేనేమైనా తెలివి తక్కువ వాడిననుకున్నావా? ప్రతీ పనిలో లాభ నష్టాలు బేరీజు వేస్తే గాని ఏ పని చెయ్యను నేను. ఇప్పుడు రాజీకి ఎనిమిదో నెల. ఆరోగ్యం అంతంత మాత్రంగా వుంది. కంప్లీట్ బెడ్ రెస్ట్ కావాలని డాక్టర్లు చెప్పారు. డెలివరీ అయిన తర్వాత తల్లినీ, పిల్లనీ కొంత కాలం కంటికి రెప్పలా చూసుకోవాలి. నా వల్ల ఇదంతా జరిగే పనేనా? ఇక్కడేమో రోజుకు ఇరవై డాలర్లు ఇస్తామన్నా కూడా నమ్మకమైన పని మనుషులు దొరకరు. అందుకే ఆవిడను వెంటబెట్టుకు వచ్చాను. ఈ ఆడాళ్ళందరూ సెంటిమెంటల్ ఫూల్స్. కాస్త ప్రేమ నటిస్తే ఠక్కున వలలో పడిపోతారు. ఒక రెండు సంవత్సరాలపాటు వేళ కింత అన్నం పడేస్తే చాలు ఇంట్లో పనంతా చేస్తూ కుక్కలా పడుంటుంది ఆ ముసలిది. ఇక నాకేం చీకూ చింతా లేదు. నౌ ఐకెన్ కాన్సంట్రేట్ ఆన్ మై కెరీర్' విజయగర్వంతో నవ్వుతూ చెప్పాడు వేణు.
'వేణూ! యు ఆర్ రియల్లీ గ్రేట్. నీలాంటి ఇంటెలిజెంట్ ఫెలో నాకు ఫ్రెండ్ కావడం నాకెంతో అదృష్టం. నీ నుండి నేను నేర్చుకోవల్సింది చాలా వుంది' మెచ్చుకొలుగా అంటూ డిస్కనెక్ట్ చేసాడు కిరణ్.
బెడ్రూంలో ఎక్సటెన్షన్ నుండి ఇదంతా విన్న రాజీకి కళ్ళు తిరిగినంత పనయింది. భర్త కుత్సిత తత్వాన్ని, మనీ మైండెడ్ నెస్ అర్ధం అయ్యాక నవ నాడులు కృంగి బెడ్ పై కుప్పకూలిపోయింది.
జరిగే తంతు తెలియక పాపం యశోదమ్మ తన గదిలో లవకుశ సినిమా డివిడి లో చూస్తూ ఆనందిస్తోంది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|