|
|
Articles: Short Stories | మేకవన్నె పులి - Mr. Pratap Cherukuri Pratap
| |
'ఓకే!, నువ్వేం వర్రీ అవకు. నేను వెంటనే బయలుదేరుతున్నాను. కాని రాజీకి మాత్రం రావడం కుదరదు. ఇప్పుడు ఎయిత్ మంత్ కదా! ఈ స్టేజిలో ట్రావెలింగ్ చాలా ప్రమాదకరం. ఆమెను ఏదో విధంగా మేనేజ్ చెస్తాను, అక్కడ అందరికీ ధైర్యం చెప్పు' అంటూ ఫోన్ పెట్టేసాడు వేణు. భార్యకు నిద్రా భంగం కలుగకుండా నెమ్మదిగా లేచి లివింగ్ రూం లోనికి వెళ్ళి లాప్ టాప్ ఆన్ చెసి ట్రావెలింగ్ సైట్లు వెదికాడు. ఆతని అదృష్టం, ఉదయం ఏడుగంటలకు న్యూయార్క్ – ముంబాయి ఫ్లైట్ లో టిక్కెట్ దొరికింది. క్రెడిట్ కార్డ్ స్వాప్ చేసి టికెట్ కన్ ఫర్మ్ చేసి ప్రింట్ కూడా తీసి రిలీఫ్ గా ఊపిరి పీల్చుకున్నాడు. ఆఫ్ సీజన్ కావడాన్న టికెట్ట్ సులభంగా దొరికింది లేకపోతే ఎంత ఇబ్బందులు పడాల్సి వచ్చేదో ఆ తర్వాత వెళ్ళి రాజీని నిద్ర లేపి జరిగిన సంగతి చెప్పడు.నాన్న పోయారనగానే బావురుమంది రాజి. ఆమెను సముదాయించదం వేణుకి చాలా కష్టం అయ్యింది. కొంత సేపటికి ఆమె నార్మల్ అయ్యింది. ప్రెగ్నెన్సీ కారణంగా వేణూ ఒక్కడే వెళ్ళడానికి సమ్మతించింది. అప్పటికప్పుడే ఆమెకు తోడుగా వుండడానికి న్యూయార్క్ లో సౌత్ ఎవెన్యూ లో వుండే తన స్నేహితుడు కిరణ్ భార్య కొన్ని రోజులు వుండే ఏర్పాటు కూడా చేసాడు వేణు.
పద్దెనిమిది గంటల తర్వాత హైదరాబాద్ చేరుకున్నాడు వేణు. ఆసుపత్రి లో మార్చురీ నుండి అప్పుడే రాఘవరావు గారి పార్ధివ శరీరాన్ని తీసుకు వచ్చి వారి స్వంత ఇంటిలో వుంచారు. ఆయన భార్య యశోద శోకదేవతలా వుంది. భాస్కర్ సంగతి చెప్పనవసరం లేదు. చేష్టలుడిగిన వానిలా కూర్చోని వున్నాడు. భాస్కర్ భార్య గీత కాస్త అటూ ఇటూ తిరుగుతూ కావల్సిన ఏర్పాట్లను చూస్తోంది. వేణు పరిస్థితిని గమనించి వెంటనే రంగం లోకి దిగాడు. ఆ ఊళ్ళో వున్న స్నేహితులను సంప్రదించి గంట లోపే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసాడు. పంతులు గారి నుండి ఆంబులెన్స్ వరకు అన్నీ సరిగ్గా సమకూరాయి. భాస్కర్ ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా ఇరవై వేల రూపాయలను చకాచకా ఖర్చు పెట్టేసాడు వేణు.
రాఘవరావు గారి అంత్య క్రియలు అతి ఘనంగా జరిగాయి. రాఘవరావు గారు పని చెసి రిటైర్ అయిన కాలేజి సిబ్బంది మొత్తం వచ్చారు. అందరితో కలుపుగోలుగా వుంటూ నోట్లో నాలుకలా మెలిగే రాఘవరావు గారు తన మొత్తం సర్వీస్ లో అజాత శత్రువు అనే బిరుదును సంపాదించారు. ఎవరినైనా నొప్పించే విధం గా ఒక్క మాట కూడా మాట్లాడి వుండరు. అటువంటి మంచి మనిషికి అందరూ అశ్రుతర్పణాలతో వీడ్కోలు పలికారు.
ఆ తర్వాత దశ దిన కార్యక్రమం కుడా ఘనంగా జరిగింది. వేణు స్నేహితుల సాయంతో ఆ కార్యక్రమం ఏ లోటూ రాకుండా జరిపించాడు.
ఆ ఇంట్లో అంతా సర్ధుకున్నాక అత్తగారిని తనతో తిసుకువెళ్ళే ప్రపోజల్ పెట్టాడు వేణు. 'బావా నాన్న లేరు, ఇంక అమ్మ తప్ప మాకు పెద్ద దిక్కు ఎవరున్నారు? వున్న దాంట్లో సర్ధుకొని అమ్మను మేము జాగ్రత్తగా చూసుకుంటాము, అమ్మను ఇక్కడే వుండనివ్వు' భాస్కర్ అన్నాడు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|