|
|
Articles: Short Stories | మేకవన్నె పులి - Mr. Pratap Cherukuri Pratap
| |
‘అది కాదు భాస్కర్, అత్తగారికి చేంజ్ ఆఫ్ ప్లేస్ చాలా అవసరం. ఇక్కడే వుంటే మావయ్య గారి స్మృతులు అనుక్షణం వెంటాడుతూ వుంటాయి. అందుకే అక్కడికి తీసుకు వెళ్తాను. వాతావరణం మార్పు వలన ఆవిడ త్వరగా కోలుకునే అవకాశం వుంది' అంటూ అందరినీ కన్విన్స్ చేసాడు వేణు. రాజీ కూడా ఫోన్ చేసి అన్నయతో, అమ్మతో మాట్లాడి వారిని ఒప్పించింది.
వీసా ఫార్మాలిటీస్ పూర్తి చేయించి వారం తర్వాత యశోదను తీసుకొని అమెరికాకు తిరిగి బయలుదేరాడు వేణు. రాజీ అమ్మను చూసి ఎంతో పొంగిపోయింది. అపార్ట్ మెంట్ లో అటాచ్డ్ బాత్రూం వున్న గది, ఫోను, టి వి , డి విడి ప్లేయర్ వగైరా సమకూర్చారు.
టనాకెందుకు తల్లీ ఈ హడావిడీ అంతా?ట' అడిగింది యశోద.
'అదేమిటం డీ అలా అంటారు? ఇక్కడ వున్నంత కాలం ఫ్రీ గా వుండండి పైగా మీకు ఏ లోటు రానివ్వనని భాస్కర్ వాళ్ళకి మాటిచ్చాను కూడా' వినయంగ అన్నాడు వేణు.
రాజీకి ఎంతో సంతోషంగా అనిపించింది. అమెరికా వచ్చిన నాలుగేళ్ళలో అమ్మను ఎంతో మిస్ అయ్యింది. ఇక కొన్నాళ్ళ పాటు అమ్మ దగ్గర హాయిగా వుండవచ్చు అనుకొని ఆనందించింది. అమ్మను తన స్వంత తల్లి కంటే ఎక్కువగా ప్రేమించే వేణు లాంటి భర్త దొరకడం నిజంగా తన అదృష్టంగా భావించింది.
ఇంతలో కిరణ్ నుండి ఫోన్ వచ్చీంది. వేణు ఎత్తాడు. 'ఏమిట్రా నువ్వు చేసిన ఈ వెధవ పని. ఆ ముసలిదానిని నీ దగ్గరకు తెచ్చుకున్నావు. అక్కడ మీ బావ దగ్గర వదిలేస్తే పోయేదిగా' అన్నాడు కిరణ్ చికాకుగా.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|