|
|
Articles: Short Stories | గాళ్ ఫ్రెండ్ - Miss rajeswari rajeswarinedunuri
| |
`మరి ఇన్నాళ్ళు మనం కుడా సినిమాలు, షికార్లు తిరిగాం కదా?' అంది నీరసంగా.
`అవును తిరిగాం. ఫ్రెండ్స్ అంటే అందరితోటి తిరుగుతాం. వాటీజ్ దేర్?' నిర్లక్ష్యంగా తలెగరేసాడు.
`ఐతె నా మీద లౌ లేదా? సూటి గా అడిగింది సహనం కోల్పోయి'
`ఆహాహాహా విరగబడి నవ్వాడు. లౌ లౌ షి ఈజ్ ఆల్సొ మై లౌ అంటూ పక్కనే ఉన్న ఆమెని దగ్గర గా తీసుకుని వాటేసుకున్నాడు.
`యూ...చీట్... మోసం...మోసం....చేసావ్? ఇంకా నయం నిన్ను పెళ్ళి చేసుకుందామనుకున్నాను' అంది ఎంతో అమాయకంగా లావణ్య.
`మ్యారీ యు వాంటు మ్యారీ వాటె హెల్ ?నొ...నొ...నొ..! అలాంటివి మాకు తెలియదు. లైఫ్ ఎంజయ్ చేయడమే మాకు తెలుసు. మీ ఇండియన్సుకి ఉన్న జబ్బే ఇది. బతకడం చేతగాదు. చచ్చిందాక ఒకడే భర్త, ఒకటే భార్య. పూర్ సెంటిమెంట్స్' అని విరగబడి నవ్వుతూ తనతో ఉన్న ఆమెని మరింత దగ్గరగా పొదివి పట్టు కున్నాడు.
లావణ్యకు రోషం, ద్వేషం, ఉక్రోషం, బాధ ఒక్కుమ్మడిగా నిలువెల్లా దహిస్తుండగా `దెన్! వాటెబౌట్ మి?' గట్టిగా అరిచింది.
`యు...ఆరె.ఎ..గాళ్...ఫ్రెండ్...ఓన్లీ ...ఎ...గాళ్ ...ఫ్రెండ్..దట్సాల్!' అన్నాడు నిర్లక్ష్యంగా. పక్కనే ఉన్న ఆమె వైపు తిరిగి మరింత దగ్గరగా తీసుకుంటూ.
`అంతే గిరుక్కున వెనుదిరిగింది. కళ్ళముందు స్టెప్ ఫాదర్లు, స్టెప్ మదర్లు, రోజుకో అమ్మాయి, భార్యలమార్పిడి, ఒహో....వద్దు...వద్దు...అలా వీల్లేదు. ఈ పద్ధతి మన మన రక్తంలో లేదు. పూటకో గాళ్ ఫ్రెండ్, రోజుకో బోయ్ ఫ్రెండు, తన వల్ల కాదు. ఇన్నాళ్ళ స్నేహంలో తను కనిపెట్ట లేక పోయింది. అందుకే మన భారతీయత, మన కట్టుబాట్లు మనకే స్వంతం. గర్వించ తగ్గ సాంప్ర దాయాల్ని వదులుకుని తానెంత వెర్రి వ్యామోహంలో పడింది? ఎంత ఇక్కడే పెరిగినా తెలుగు చదవటం, రాయడం రాకపోయినా కొన్ని సినిమాలు, పురాణ గ్రంధాలు చూస్తుంటే అనిపిస్తూనే ఉంటుంది మనం ఏమి కోల్పోతున్నామో, ఎంత నష్ట పోయామో? అందుకే నేమో, తనలోనూ ఆ రక్తమే ప్రవిహిస్తున్నట్టుంది. అందుకే అతగాడి చేష్టలు, మాటలు భరించలేక పోయింది... థాంక్ గాడ్!! ఇంతటితో బయట పడింది. ఈ మాత్రానికేనా? అమ్మా, నాన్నలతో అంతగా వాదించింది?' అనుకుని తేలిక బడిన మనసుతో ఐయాం ఓన్లీ ఎ గాళ్ ఫ్రెండ్... నాట్... మోర్ దేన్... గుడ్...బై...' అని చెప్పి... తమ స్నేహాన్ని నెమరు వేసుకుంటూ బరువెక్కిన గుండెలతో... బరువు... గా... ఇంటి వైపు అడుగులు... వేసింది... లావణ్య.
| Read 4 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|