|
|
Articles: Short Stories | గాళ్ ఫ్రెండ్ - Miss rajeswari rajeswarinedunuri
| |
`డాడీ! నేను రాబర్ట్ ని పెళ్ళి చేసు కుంటాను!' అంది డిన్నరు చేస్తు.
`నీకేమన్నా మతి పోయిందా?, వాళ్ళకీ మనకీ ఎలా కుదురుతుంది? , అన్నాడు సాలోచన గా!'
అప్పటి కే కొన్నాళ్ళుగా వాళ్ళ పరిచయాన్ని పసిగట్టిన శ్రీనివాస్ .
`ఎందుకు కుదరదు? ఇష్ట పడినప్పుడు కష్టం అనిపించదు' అంది తండ్రిని సూటిగా చూడటనికి కొంచం భయపడి కళ్ళు దించుకుని.
`ఇది సినిమా కాదు. జీవితం. అనుకున్నంత తేలిక్కాదు ఆచరణలో!'
`ముందు కొంచెం కష్టం అనిపించినా, రాను రాను అలవాటౌతుంది' మొండిగా అంది.
`అదికాదురా మన కట్టుబాట్లు, ఆచారాలు వేరు. అలాటివేవీ తెలియని వాళ్ళు వీళ్ళు! చాలా నెమ్మదిగా, లాలనగా అన్నాడు.
`అదికాదు డాడీ! అతను కాలేజి చదువప్పట్నుంచీ పరిచయ మైనవాడే, వాళ్ళింట్లోను మనింట్లోను అందరికీ తెలుసు. ఇలా తెలిసిన వాణ్ణి చేసుకుంటే ఇబ్బంది ఉండదు కదా ?'
`మనకి తెలిసింది పై పై పరిచయాలే. పైగా ఇక్కడి వాడు' అన్నాడు నచ్చ చెప్పే ధోరణిలో .
`అక్కడా ఇక్కడా, ఇక్కడా అక్కడా? ఒకటే గోల అంత పట్టింపు ఉన్న వాళ్ళూ అక్కడే ఉండలేక పోయారా? ఇక్కడకి తెచ్చి మా ప్రాణాలు తియ్యక పోతే? మీరు మాత్రం ఐన వాళ్ళందర్ని వదులుకుని ఇక్కడి పద్ధతులకు అలవాటు పడలేదా?' రోషంగా అని డిన్నరు సగంలో లేచి పోయింది'.
`నువ్వు చాలా పెద్ద దానివై పోయావ్! బాగా ఆలోచించుకో ఎందుకైనా మంచిది' హెచ్చరిం చాడు శ్రీనివాస్.
`దానిష్టానికలా వదిలేసారేమిటండీ? చిన్నపిల్ల దానికేం తెలుసు?' బాధగా అంది భార్య సుసీల.
`నీకేం తెలియదు. నువ్వూరుకో!' అన్నట్టు సైగ చేసాడు.
`తండ్రి కాస్త ఆసరా ఇచ్చేసరికి, రెట్టించిన ఉత్సాహంతో' నువ్వు కాదన్నా, డాడీ ఒప్పు కుంటాడులే అన్నట్టు చూసింది తల్లి వైపు నిర్లక్ష్యంగా.
మర్నాడు ఈ సంగతి రాబర్ట్ కి చెప్పెయ్యాలన్న ఆనందంలో కాస్త ముందుగానే వెళ్ళింది కాలేజీకి. ఆరోజు కాదుకదా వారం పది రోజులైన అతగాడు కనుపించ లేదు. మతి పోయింది లావణ్యకి. తామిద్దరూ తిరిగిన రెస్టారెంట్లు, ఐస్క్రీం పార్లర్లు... అన్నీ లీజర్ టైములో తిరిగి తిరిగి గాలించింది. చివరికి ఒక రోజు సాయంత్రం తొందరగా ఇంటికి వెళ్ళడం ఇష్టంలేక కాంపస్ లో చెట్లక్రింద కూర్చుందామని వెడు తుంటే ఎదురుగా బెంచీ మీద రాబర్ట్ మరొక అమ్మాయితో కిల కిలలు. ఆమెని తనెప్పుడూ చూడలేదు. దగ్గరగా వెళ్ళి అడిగింది `ఎవరీమే? ఇన్నాళ్ళూ ఎక్కడికెళ్ళావ్?' అని. మనస్సులో ఏదో తెలియని జెలసీ, గుండెల్లో సన్నని బాధ.
`ఏం? ఎందుకు? ఈమె నా గాళ్ ఫ్రెండ్. అలా అలా జాలీగా తిరిగొచ్చాము. ఎప్పుడూ స్టడీఏనా? బోర్' అన్నాడు విలాసంగా నవ్వుతూ... ఇంగ్లీషు లోనే.
| Read 4 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|