|
|
Articles: Drama | తొలకరి పలకరింపులు - Site Administrator
| |
సూరన్న : ఓరెవుడ్రాడు? ఏంవిరా రామన్నా
రామన్న : తడిసిపోతున్నాను బాబో... తుంపర్లా మేగమో
తొలకరొచ్చింది బావొ... తొంగంతామేటి మళ్ళ
పనుల్లోకి దిగకపోతే - పేగులెలా నిండుతాయి
యింతలోన మా పిల్ల - ఈతసాపలకూకున్నది (సంవర్తాడింది)
మంచేటో చెడ్డేటో - పంచాంగం సూడండిబాబు
సూరప్ప : ఓరోరి రామన్నా - అదురుష్టం నీదేరా
తొలకరిలో సంవర్తి - శుభం కలుగుతాదెల్లరొ
రామన్న : సంకల్పం ఆడిది (దేవుడిది) - సంబరాలు (ఖర్చులు) మావి అమ్మ
సల్లగుండు మాతల్లి - సంవర్తి గుంట(కూతురు) ను దీవించు
సూరమ్మ : కుంచడు బియ్యం ఇదిగోరా - సిలకట్టు కొంగు చాపర
ఉట్టితోని ఈ బెల్లంకుండ - పట్టుకుపోరా నాయన
అరిటిగెల తోలుతాను - అరటిపళ్ళు కొనకురా
పసుపు దంచిస్తాను - కుంకం బరిణి యిస్తాను
రవికగుడ్డ పంపుతాను - చీరకొని తోలుతాను
ఎంతపనీ చేసింది గుంట - వర్షమొచ్చినట్టుగుంది
పదపదరోరి - గుంటకి అచ్చింతలు యేసొస్తాను
రామన్నను యెంటబెట్టకొని సూరప్ప ఆడింటికి యెలిపోతుంటే చూసి ..
సూరన్న: పంచాంగం సెప్పమనీ - పారిపోతండు యేటి ఆడు
మూర్తాలూ తీర్తాలు - మరచిపోయినట్టు చేసింది ముసిలీ
నా పంచాగం పరువులు - తీసీసినట్టుంది ఆడదీ
ఏం సేతుం నాయనో - ఇలాటి ఇల్లాలి తోటి
పాపన్న : మూర్తం తీర్తం చూసీ బయట - కూకుంటదేటి ఆడదాయి
పంచాంగమంటే - ఆడదాని పాదాలకింద రాత.. బావ
సూరప్ప చెప్పిందీ - బారికోడివేదమూ
సూరప్పమాటోయి బావ - పేదోడి పురాణమూ
సూరన్న - నువ్వు మేఘంవి - సూరప్ప అంటే భూమి బావ
సూరన్న : ఇలగిలగా చూస్తే - అలగలగేవుంది బావ.
తపడ తపడ చినుకులు పడ్డం ఆరంభమై... దడేల్ మని ఉరుమీ మెరసీ, కురవడం మొదలెట్టింది మేఘం. భూమి బాగా తడిసినట్టుంది ఎక్కడో... భలే మట్టి వాసనేస్తోంది గాలి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|