|
|
Articles: TP Features | తెలుగుజాతి కోసం... - Site Administrator
| |
ఎంతో శక్తివంతమైన తెలుగుభాష, ఏ ఇతర భాషా పదాలనైనా కలుపుకొని ఎదగగల స్వాభావికత ఉన్న భాష, శాస్త్ర సాంకేతిక పదజాలాన్ని ఇముడ్చుకోగలదిగా చెప్పబడిన భాష ఎందువల్ల ఎదగడం ఆగిపోయింది? తెలుగు రాజ్యంలో తెలుగు ఎందుకు ఆధిపత్యం వహించలేకపోతున్నది? తన అవసరాలను గాని, తన భౌగోళిక ప్రాంతంలోని చిన్నచిన్న భాషా సమూహాల అవసరాలు గానీ తీర్చలేని భాషా జాతీయత గౌరవాన్ని, గుర్తింపును ఎట్లా పొందుతుంది?
ఒక బలమైన భాషా సమాజంగా తెలుగుజాతి ఎదగలేకపోతున్నందువల్లనే, తన బలహీనతను ప్రదర్శిస్తున్నందువల్లనే - సామాజిక ఐక్యమతాన్ని కానీ, భాషా సాంస్కృతిక సహానుభూతిని గానీ సాధించలేకపోవడం వల్లనే అందరి దృష్టిలోనూ మనం నగుబాటు పాలవుతున్నాము.
మన రాష్ట్రంలో పనిచేసే ఇతర భాషీయులైన ఐ.ఎ.ఎస్ లు తెలుగు పాలనకు తూట్లు పొడుస్తున్నారన్నా, పొరుగు రాష్ట్రాల పాలకులు మన ప్రభుత్వాన్ని లెక్కచెయ్యట్లేదన్నా అందుకు మౌలిక కారణం మనం ఒక భాషాజాతిగా గట్టిగా లేకపోబట్టే. కేంద్ర ప్రభుత్వ మనుగడ మనం ఇచ్చే బలం మీదే ఆధారపడినా నిన్నటి రైల్వేబడ్జెట్ లో మనకు మొండిచెయ్యి చూపడానికి కారణం - కచ్చితంగా ఇదే.
తెలుగు నేలపైన ఉన్న ప్రభుత్వమూ ప్రజలూ ఇంత బలహీనంగా వ్యవహరిస్తున్నపుడు ఇతర రాష్ట్రాల్లో అసంఖ్యాకంగా ఉన్న మన తోటి భాషీయుల పరిస్థితి ఏమిటి? మనవాళ్లకు అన్ని విధాలైన బలాన్ని ఇవ్వవలసింది పోయి, ఇంత అర్భకులుగా మనం వ్యవహరించడం ఏమిటి?
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|