|
|
Articles: TP Features | కృష్ణస్మరణం పాపహరణం - Site Administrator
| |
బాలకృష్ణుడు తన ఆరో ఏట గోపికా వస్త్రాపహరణం చెయ్యటం, ఏడో ఏటనే గోవర్ధన పర్వతాన్ని ఎత్తటం వంటివి భక్తులు జన్మాష్టమినాడు స్మరించుకుంటుంటారు. ఇవన్నీ ధర్మోద్ధరణ కోసం సామాన్య మానవుడిగా జన్మించిన ఆ భగవానుడి దివ్య లీలలే అన్నది భక్తుల విశ్వాసం. కృష్ణుడు జన్మించింది అర్ధరాత్రి వేళ కనుక ఈ జన్మోత్సవాన్ని దేవాలయాలలో అర్ధరాత్రి జరుపుకోవటం కనిపిస్తుంది.
కృష్ణాష్టమి అనంతరం ఈ ఉత్సవాలలో భాగంగానే డోలోత్సవమూ (ఉయ్యాల ఉత్సవం) చేస్తుంటారు. కృష్ణ విగ్రహానికి పొన్నపూలతో పూజ, పదహారు పిండివంటలతో నైవేద్యం అర్పించే ఆచారమూ ఉంది. పూజా సమయాలు, నైవేద్యాలలో కొద్దిపాటి తేడా ఉన్నా ధర్మ రక్షణ కోసం అవతరించిన ఆ దేవదేవుడి జన్మదినోత్సవాన్ని దేశం అంతటా అందరూ ఎంతో ఆనందంగా జరుపుతుంటారు.
కృష్ణాష్టమి పూజా విధానం :
1. లేవవలసిన సమయం : ఉదయం 5 గంటలు
2. శుభ్రపరచవలసినవి : పూజామందిరం, ఇల్లు శుభ్రం చేయాలి
3. చేయవలసిన అలంకారాలు : గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరంలో ముగ్గులు వేయాలి
4. చేయవలసిన స్నానం : తలస్నానం
5. ధరించవలసిన పటుబట్టలు : పసుపు రంగువి
6. పూజామందిరంలో చేయవలసినవి : పూజకు ఉపయోగపడే వస్తువులు, పటాలకు గంధం, కుంకుమ అలంకరించాలి
7. మందిరంలో పరచాల్సిన వస్త్రం: పసుపు రంగు
8. కలశంపై వస్త్రం రంగు : పసుపు రంగు
9. పూజించవలసిన ఫోటో : శ్రీకృష్ణుడు రాధతో కలిసి ఉండేది
10. పూజించవలసిన ప్రతిమ : శ్రీకృష్ణుడు
11. పూజించవలసిన దైవం : శ్రీకృష్ణుడు
12. తయారుచేయాల్సిన అక్షతలు : పసుపు రంగు
13. పూజకు కావలసిన పువ్వులు : కదంబ పుష్పాలు
14. అలంకరణకు వాడాల్సిన పూలు : సన్నజాజులతో మాల
15. నివేదన చేయాల్సిన నైవేద్యం : పానకం
16. సమర్పించవలసిన పిండివంటలు : వడపప్పు
17. నిషేధించవలసిన పండ్లు : కమలాఫలాలు
18. పారాయణ చేయవలసిన అష్టోత్తరం : శ్రీకృష్ణ అష్టోత్తరం
19. పారాయణ చేయవలసిన స్తోత్రాలు : శ్రీకృష్ణాష్టకం
20. పారాయణ చేయవలసిన ఇతర స్తోత్రాలు : బాలకృష్ణ స్తోత్రమ్
21. పారాయణ చేయవలసిన సహస్రాలు : శ్రీకృష్ణ సహస్రనామం
22. పారాయణ చేయవలసిన గ్రంథం : శ్రీమద్భాగవతం
23. పారాయణ చేయవలసిన అధ్యాయాలు : దశమ, ఏకాదశ స్కంధాలు
24. దర్శించవలసిన దేవాలయాలు : శ్రీకృష్ణదేవాలయం
25. దర్శించవలసిన పుణ్యక్షేత్రాలు : గౌడీయ మఠాలు
26. చేయవలసిన ధ్యానాలు : కృష్ణ ధ్యానశ్లోకాలు
27. చేయించవలసిన పూజలు : కృష్ణ అష్టోత్తర పూజ
28. దేవాలయంలో చేయించవలసిన పూజాకార్యక్రమాలు : కృష్ణ సహస్రనామ పూజ
29. సేకరించివలసిన పుస్తకాలు : భాగవతం
30. సన్నిహితులకు శుభాకాంక్షలు తెలుపుతూ అందజేసే పుస్తకాలు : శ్రీకృష్ణ నిత్యపూజ
31. స్త్రీలకు తాంబూలంలో ఇవ్వాల్సినవి : శ్రీకృష్ణ నిత్యపూజ
32. దేవాలయంలో నిర్వహించవలసిన ఉత్సవాలు : శ్రీకృష్ణ లీలలు (నాటిక)
33. దేవాలయంలో నిర్వహించాల్సిన ప్రత్యేక పూజలు : శ్రీకృష్ణ చరిత్ర (ఉపన్యాసాలు)
34. పర్వదిన తిథి: అష్టమి
35. పర్వదినం ఈ వారం వస్తే చాలా మంచిది : ఆదివారం
36. పర్వదినం రోజున పూజ చేయాల్సిన సమయం : మధ్యాహ్నం 12గంటలు
37. వెలిగించాల్సిన దీపారాధన కుంది : కంచు దీపం
38. వెలిగించవలసిన దీపారాధనలు : 2
39. వెలిగించవలసిన వత్తుల సంఖ్య : 5
40. వెలిగించవలసిన వత్తులు : దూదితో
41. దీపారాధనకు వాడవలసిన నూనె : కొబ్బరినూనె
42. వెలిగించవలసిన ఆవు నేతితో హారతి : పంచహారతి
43. ధరించవలసిన తోరం : సింధూరం
44. నుదుటున ధరించవలసినది : సింధూర
45. 108 మార్లు జపించవలసిన మంత్రం : ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
46. జపానికి వాడాల్సిన మాల : తులసిమాల
47. మెడలో ధరించాల్సిన మాల : తులసిమాల
48. మెడలో ధరించవలసిన మాలకు ప్రతిమ : శ్రీకృష్ణ
49. చేయవలసిన అభిషేకం : పంచామృతాలతో
50. ఏ దిక్కుకు తిరిగి పూజించాలి : తూర్పుదిక్కు
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|