|
|
Articles: TP Features | ఆత్మరక్షణకేనా 'ఆకర్ష్' ? - Site Administrator
| |
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో వైఎస్ ను కాదని తల ఎగురవేసే మంత్రి, లేదా నాయకుడు ఎవరూ లేరు. వైఎస్ కు ఢిల్లీ అధిష్టానం అండదండలు సంపూర్ణంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయినా... కూడా ముఖ్యమంత్రి వైఎస్ 'ఆకర్ష్'ని వైఖరిని ఎందుకు తీసుకున్నారు. దీని వెనుక ఆసక్తికరమైన అంశాలు ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.
2004 ఎన్నికల్లో తిరిగులేని మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధించినా కూడా ముఖ్యమంత్రిగా వైఎస్ ను తొలగించి మరో కేంద్రమంత్రిని ఆ స్థానంలో నియమిస్తారన్న ప్రచారం తరచూ రాజకీయ వర్గాల్లో వినిపించేది. కానీ వైఎస్ అధిష్టానం ఆమోదంతో ఐదేళ్ళు పూర్తి చేయడమే కాక ఢిల్లీ పెద్దలకు హామీ ఇచ్చినట్లుగా కాంగ్రెస్ పార్టీని తిరిగి గెలిపించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలుగా సోనియా గాంధీ హయాంలో తరచూ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మార్చే సంప్రదాయానికి దాదాపు తెరపడిందనే చెప్పాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కాంగ్రెస్ కు 156 స్థానాలు ఉన్నాయి. మంత్రి పదవులు దక్కని నేతలు, ఎన్నికల్లో టిక్కెట్లు చిక్కని నేతలు.. అంతా అసమ్మతిగా ముఠా కట్టి మరో వర్గంగా మారే ప్రమాదం ఉందని వైఎస్ భావిస్తున్నారా? లేదా 2001లో తెలంగాణాపై తెలుగుదేశంలో గందరగోళం నెలకొన్నప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు కొన్ని వర్గాలను ఇతర పార్టీలు ప్రోత్సహించిన పరిస్థితులు - తమకు కూడా ఎదురు కావచ్చని వైఎస్ 'ముందు చూపు'తో వ్యవహరిస్తున్నారా? లేదూ.. రాష్ట్ర కాంగ్రెస్ లో అసమ్మతి అంచలంచెలుగా పెరిగి.. పరిణామాలు వేగంగా మారినప్పుడు.. కాంగ్రెస్ అధిష్టానం మనస్సు మారుతుందేమోనన్న శంక వైఎస్, ఆయన సన్నిహితులునూ పట్టి పీడిస్తోందా?
అందుకనే... ఎటుపోయి ఎటొచ్చినా తన పీఠానికి ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్తగా ఇతర పార్టీల శాసనసభ్యుల మద్దతును కూడగడుతున్నారా? అని రాజకీయ వర్గాలు మదనపడుతున్నాయి. ఇందుకోసమే ప్రత్యర్థి పార్టీల్లోని శాసనసభ్యులను 'వలసబాట' పట్టేట్టు పలు విధాలుగా ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన ఒక సమావేశంలో కాంగ్రెస్ నేతలతో 'శాసనసభ్యులు కావాలి' అని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. 'ఆపరేషన్ ఆకర్ష్ ' వెనుక మర్మమేమిటనేది ఇక రాగల కాలమే వెల్లడిస్తుంది.
| Read 4 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|