|
|
Articles: TP Features | పాస్ పోర్ట్ కష్టాలు - Site Administrator
| |
ప్రాంతీయ పాస్ పోర్ట్ కేంద్రం మాజీ అధికారి బాలభాస్కరరావుకీ అక్కడి సిబ్బందికి మధ్య విభేదాలు ఏర్పడడంతో పనిచేసే పరిస్థితులు మరింతంగా దిగజారాయి. ఈ విషయమై నూతన అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ కొద్ది కాలంలో సమస్యలు పరిష్కారం కాగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తమ కార్యాలయాల్లోనే కాకుండా, 74 తపాలా కార్యాలయాలు, ఈసేవా కేంద్రాల్లోనూ, ఎస్పీ కార్యాలయాల్లోనూ ప్రజలు దరఖాస్తు చేయవచ్చునని చెప్పారు. సాధారణంగా నిర్ణీత గడువు 45 రోజుల్లోగా పాస్ పోర్టులు మంజూరైన దాఖలాలు బహు అరుదుగా కనిపిస్తాయి. దీనితో ఏ దరఖాస్తు దారుని కదిలించినా ఒక దయనీయ గాథ వినిపిస్తుంది. ఇలా అయితే లాభం లేదని తత్కాల్ ను ఆశ్రయించినా పాస్ పోర్ట్ మంజూరులో జాప్యం అనివార్యంగా జరుగుతోంది. తత్కాల్ కింద దరఖాస్తు చేసిన పక్షంలో వారం లోగా పాస్ పోర్ట్ కు మూడు వారాల వ్యవధి పడుతుంది. విదేశాలకు త్వరగా వెళ్ళాలని భావించే వారికి ఈ జాప్యం దుర్భరంగా ఉంటుంది.
దరిమిలా పాస్ పోర్ట్ కోసం ఏ జెంట్లను ఆశ్రయించడం అనివార్య మవుతోంది. దరఖాస్తు దారులకు టెలిఫోన్లో సమాధానాలు ఇచ్చేందుకు త్వరలో సిబ్బందిని నియమిస్తామని పాస్ పోర్ట్ అధికారి తెలిపారు. ఇప్పటికే బెంగళూరు పాస్ట్ పోర్ట్ కార్యాలయంలో టీసీఎస్ సేవలు అందిస్తోందని, ఈ ప్రాజెక్టు హైదరాబాద్ కు కూడా అమలు అయితే అనేక సమస్యలు పరిష్కారం కాగలవని శ్రీనివాస్ వివరించారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|