|
|
Articles: Short Stories | రైతక్క - Site Administrator
| |
తవ్వంత పిల్లలుంటే తల్లికాసర. కానీ తను తండ్రి కాసరయింది. తండ్రిది ఒంటిరెక్క పాణం. తను ఒక్కతే సంతానం. పొద్దుపొడవక ముందే తండ్రితో చేనులో ఉండేది. తండ్రిని ఒడ్డుమీద కూసోబెట్టి నాగలి దున్నేది. ఒకనాడు 'నాగలి ఎత్తుకపోయి నాయినకు ఇచ్చివత్తనంటే' తల్లి కోపంగా 'ఆడ పిల్లవు నడీ ఊర్లె నుంచి నాగలి మొత్తావు' అన్నది. అది ఇది అని అప్పుడు తెలువకపోయినా ఏదో దిక్కార భావమే కలిగింది. ఆ కోపంతోనే మట్టుపార అందుకుని వంగి ఎకురం చేను ఒడ్డు ఒరాలను చెక్కిపూసింది. ఎద్దు ఎవసాన్ని తన చేతుల మీద నడిపింది.
అదేం కిస్మతో గాని దొరికిన భర్త ఒంటిరెక్క పాణమే. ఎంట నిలవడితే గాని ఎడ్ల బండి కట్టేవాడు గాదు. తను నొగలు వట్టి లావడితేనే భర్త ఎడ్లమెడల మీద కాని కట్టేవాడు. బండి ఎనుక ఉండి అలుపటి దాపటి ఎడ్లను కలిపి దమాయించితేనే పని నడిచేది. భర్తకు రెండు వరికట్టలు ఎత్తి తను నాలుగు కట్టలు ఎత్తుకునేది. ఉన్నడా అంటే ఉన్నడు అన్నట్లు భర్తను ముందు నడిపి ఎనుకపట్టున తను అన్ని చూసుకునేది. నాగలిగట్టి భర్త చేతికిచ్చి నాలుగు సాళ్ళు తిరిగేలోపు సగం మడిని పారతో తవ్వుకునేది.
వరికోతల మీదనైతే నిద్రనే ఉండేదిగాదు. భర్తను నిద్రపొమ్మని తను మాత్రం వడ్లకట్టలను కొట్టేది. కట్టలన్నీ కొట్టి వడ్లరాశి చేసినంక నిద్రలేచిన భర్త 'వడ్లరాశికి పొత్తి చుట్టాలె. ఆడిది చుడితే అడుగువడుతది. మొగోడు చుడితే మొగులు ముడుతది. జరుగు జరుగు' అని తనను పక్కకు తరిమి బూడిద పొత్తి చుట్టినప్పుడు రాత్రంతా రాని నీరసం వచ్చేంది. ఊర్లు పక్కచేన్ల హైబ్రిడ్ మక్క అలికిన్నాడు నడీమడిల గోరికట్టుకుంది. మొక్క మొక్కను పోదన జేసి కంకి కంకిని కంటికి రెప్ప లెక్క కాపాడింది. మంచి పంట పండిందని మండలం సార్లు మాత్రం భర్తనే ఉత్తమరైతుగా గుర్తించారు. ఆనాడు తనాలో తానే నవ్వుకుంది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|