|
|
Articles: Short Stories | సాగరయానం - Miss rajeswari rajeswarinedunuri
| |
పదకొండవ అంతస్తుకి వెడితే అక్కడ చిన్న పిల్లల స్విమ్మింగు టెన్నిస్ ఆటలు పక్కన రూములోకి వెడితే స్పా అంతా అందాలకి మెరుగులు. బయట మళ్ళీ గోల్ఫ్ ఆటలు. ఇలా అన్నీ చూసుకుంటూ చివరి గా పన్నెండో అంతస్తు కి వెడితె పొగ గొట్టం తెర చాప డెక్ మొత్తం తిరుగు తుంటే సమయం తెలియలేదు కొద్ది నిముషాల్లో షిప్పు బయలుదేర బోతోందని ఎనౌన్స్ మెంటు. అప్పటికి సంధ్య చీకట్లు అలము కొంటున్నాయి. ఇక నా డ్యూటీ ఐపోయిందన్నట్లు దివాకరుడు తన అలసిన రధాశ్వాలను వెనుకకు మరల్చు తున్నాడు. విరహాన్ని భరించలేని ఆకాశం జేగురు రంగు దాల్చి కోపంగా చూస్తున్నట్టుంది. మరొక వైపు తన చల్లని కిరణాలతో అలరించాలని తాపత్రయ పడుతున్న చంద్రుడు సగం సగం అర్ధ చంద్రాకారంలొ నృత్యం చేస్తున్నాడు. మీ ఇద్దరి ఆగమన నిష్క్రమణాలతో నాకేమీ సంబంధం లేదు అన్నట్టుగా నేనెవరికీ ఏమీ కాని ఎవరికీ చెందని అసుర సంధ్యను నిష్క్రమించక తప్పదు అనుకుని పేలవంగా నవ్వుకున్న సంధ్య నీరసంగా కదలి పోతోంది.
షిప్పు నీటిని ముందుకు తోసుకుంటూ దూరంగా వెడుతూ సముద్రంలో కలుస్తుంటే వింత అనుభూతి. నురగలు గక్కుతున్న కెరటాలు ఎడా పెడా కసిగా దారి వదులుతూ తప్పు కుంటున్నాయి. పశ్చిమాన ఇనుడు ఇంకా ఇంకా సగరుని కౌగిట ఒదిగి పోతున్నాడు. ఆ సుందర దృశ్యం చూస్తూ డెక్ మొత్తం తిరిగే సరికి డిన్నరుకి టైమైయింది. ఇక మూడో అంతస్తు లో పారిస్ డైనింగు హాలుకి వచ్చాము. హాలంతా పెద్ద పెద్ద రౌండు టేబుళ్ళతో టేబుల్‌కి పది కుర్చీలతో అందమైన టేబుల్ క్లాత్‌లతో చెంచాలు, ఫోర్కులు, ప్లేట్లు అన్నీ సిద్ధం చేసి సర్వర్లు చిరు నవ్వుల పలకరింపులతో స్వాగతం పలికారు.
ఇండియన్ ఫుడ్ వెజిటేరియన్ కావాలని అడిగాము. అందుకు ఈ రోజుకు మాత్రం మాదే ఉంటుంది. రేపటి నుంచి మీరడిగింది ఇస్తాము అని చెప్పి మెను ఇచ్చారు. సరే ఇక తప్పేదేముంది? నేనేమీ తినను గనుక కొంచం బ్రెడ్ చెప్పి డిజర్ట్ మాత్రం ప్లైన్ వెన్నిల్లా చెప్పాను. అందుకు మామీ ఉత్త వెన్నిల్లానా? అని నవ్వారు. మా టేబుల్ కి టోనీ, లండన్ అని ఇద్దరు సర్వర్లు నవ్వుతూ, నవ్విస్తూ కొసరి కొసరి వడ్డించారు. ఇంతలో ఎవరిదో బర్త్ డే పార్టీ. కేక్ కటింగు హాపీ బర్త్ డే టూ యూ పాటలూ, చప్పట్లతో అంతా కోలాహలం. డిన్నరు అనంతరం స్టాఫ్ అందరు కలసి అక్కడే ఉన్న టేబుళ్ళ పైన, మిరుమిట్లు గొలిపే లైట్ల క్రింద, వీనుల విందుగా, కన్నుల పండువుగా చక్కని సంగీత నృత్యం.పది పదిహేను నిముషాలు మైమరచి తేరుకుని ఇక ఈ రోజుకి విశ్రాంతి తీసుకుని రేపట్నుంచీ అన్నీ చూద్దాం అనుకుని రూములకు వెళ్ళి పోయాము.
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|