|
|
Articles: TP Features | భాష ఓ సరికొత్త మందుగుండు - Site Administrator
| |
మన రాష్ట్రంలోనే మన వారే తాము ఆంధ్రులమని, తెలుగువాళ్ళమని ఈ రాష్ట్రాన్ని తమ జన్మభూమి అని భావించేవారు ఎక్కువ మందే ఉన్నారు. మిగతా వారు తమని తాము ఆంధ్రులమని, తెలుగువారమని పిలుచుకోలేని పరిస్థితుల్లో ఈనాటికీ ఉన్నారు. వాళ్ళలో అస్పృశ్య జాతులవారు, సంచార, అర్ధసంచార కులాల వారు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న 34 గిరిజన తెగలవారు తమని ఆంధ్రులుగా భావిస్తారా. భావించరు. మరి ఆంధ్రజాతి, తెలుగుజాతి, తెలుగు భాషీయత వీటికి అర్థం ఏమిటి?
నిజానికి ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇన్ని యుగాలు గడిచినా ఇంకా ఐక్యభావనని పెంపొందించలేకపోయాం. అసలు ఆ భావనని పెంపొందించలేకపోవడానికి కారణాలు కూడా ఉన్నాయి.
ఈ దృష్ట్యా ఆలోచనలు చేయలేదు. అందుకు కారణాలేమిటి?
జాతీయత, భాషీయత భావనలు రెండు అతి ముఖ్యమైనవి. అవి సాధించిన రాష్ట్రాలు లేదా బృందాలు సాంస్కృతికంగా తద్వారా సాంఘికంగా, రాజకీయంగా ముందుకుపోయాయి. ఇందుకు బెంగాలీలను, తమిళులను, కేరళీయులను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
అయితే ఓక జాతీయ భావన లేదా దేశ భావన భారతజాతి, భారతీయత Indianness అనే ఆలోచనలు భారతదేశంలోని మూలమూలన గల జనసామాన్యంలో ఇంకా లేవు. ఆ దిశగా మనకు ఇంకు కాగితాలపై పారలేదు కూడా.
పారతంత్ర్యం నుండి స్వేచ్ఛ కోసం మాత్రమే దేశభక్తి భావన అంకురించింది. ఆ తదుపరి దాని ప్రమేయం అవసరం లేకుండాపోయింది. ఆ తరువాత దేశభక్తి కలిగి ఉండడం అంటే ఆ భావన పేరుతో దేశాన్ని, ప్రజలను మోసపుచ్చడమే అయింది. ఇప్పుడు మనం దేశభక్తి అని అరిస్తే పిచ్చివానిలా చూస్తారు. నిజానికి దేశాభివృద్ధి, ఆత్మగౌరవం వంటి భావాలు ఉన్నప్పుడే దేశభక్తి వ్యక్తం అయ్యే అవకాశం ఉంటుంది. మరి అవి లేవా అంటే లేవని అనలేం కాని ఆ అభివృద్ధిలో ప్రజల పాత్రని గుర్తించడం లేదు. రాజకీయ నాయకులో, శిష్టమేధావులో ఎవరో ఏదో ఒక అతీతశక్తులో దేశభక్తి కలిగి ఉంటారని ప్రజలు అనుకునే పరిస్థితి కల్పిస్తున్నారు. అందువల్ల తమకు సంబంధం లేని విషయంలో తమ పాత్ర, తమ వంతు, తమ త్యాగాలకు (పన్నుల చెల్లింపు, మోసగించబడడం, దోపిడీ చేయబడడం వంటివి) కూడా ప్రత్యక్ష గుర్తింపు లేకపోవడం ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రజలను Passive చేయడం భారతీయ వ్యవస్థల దృక్పథం. అందువల్ల ప్రజలు దేశానికీ, అభివృద్ధికీ తెలియకుండానే 'దూరం' అవుతున్నారు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|