|
|
Articles: TP Features | ఓంకారమయం సైన్స్! - Dr. Subrahmanyam Vangala
| |
వైజ్ఞానికశాస్త్రం బాగా వేగంగా పురోగమిస్తోంది. ఎందరో శాస్త్రవేత్తలు జీవ రహస్యాలను పరిశోధనల ద్వారా విడమరుస్తున్నారు, వెలికి తీస్తున్నారు. గత అరవై సంవత్సరాలలో జీవ రహస్యం మన జీవకణంలో డి.ఎన్.ఏ. (DNA) అనే పదార్ధంలో దాగి ఉందని ఎన్నో పరిశోధనలు రుజువు చేశాయి. ప్రతి మనిషి డి.ఎన్.ఏ. లోనూ దాదాపు ముప్పయి వేల 'జీన్స్ (Genes)' ఉంటాయి అని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. ఈ జీన్స్ వల్లనే మనిషికి రకరకాల ఆకారాలు, అవయవాలూ, రంగులు, విభిన్న మనస్తత్వాలూ, తెలివితేటలూ ఆపాదిస్తున్నాయి. జీన్స్ కి ఉన్న తెలివితేటలు మహా మేధావి ఐన్ స్టీన్ (Einstein) మెదడులో కూడా ఉండలేదేమో అంటే అతిశయోక్తి కాదేమో.
సుమారు అయిదు సంవత్సరాల క్రితం టైం మేగజైన్ (Time Magazine, October 2004)లో 'ది గాడ్ జీన్ (The God Gene)' అనే ఆర్టికల్ ప్రచురించారు. మన జీన్స్ లోనే దేవుడు ఉన్నాడేమో అన్న సత్యాన్ని వెలికి తీయడానికి నాంది పలికింది ఈ ఆర్టికల్. హిందూ మతంలో 'ఓం' అనే మంత్రం చాలా బలవత్తరమైంది. 'ఓం' మంత్రం రోజూ జపించేవాళ్ళు శారీరకంగా, మానసికంగా మంచి ఆరోగ్యంతో ఉంటారు. ఈ రోజు ఇదే 'ఓం' మంత్రం వైజ్ఞానిక శాస్త్ర పదాలలో కొత్త రూపం దిద్దుకుంటోంది. జీవకణం, దానిలో ఉన్న వివిధ భాగాలు ఈ 'ఓం'కార నాదంతో ఉచ్చరించబడుతున్నాయి - సెల్ల్'ఓం' (Cellome), క్రోమోస్'ఓం' (Chromosome), జీన్'ఓం' (Genome), ట్రాన్స్-క్రిప్ట్'ఓం' (Transcriptome), రైబోస్'ఓం'(ribosome), ప్రోటి'ఓం'(proteome), మెటాబొల్'ఓం' (metabolome), మైక్రోస్'ఓం' (microsome), లైపోస్'ఓం'(liposome), లైసోస్'ఓం' (lysosome) అని రకరకాలుగా ఉచ్చరించబడే ఈ 'ఓం'కార నాదం, దేవుడు ఎక్కడో లేడు, మన జీవకణాలలోనే వివిధ రూపాలతో వెలిసి ఉన్నాడని చెపుతోంది.
దేవుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అని అంటారు. మనం నిమిత్తమాత్రులం. దైవ కృప ఎలా ఉంటే అలాగే జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. ఇదే విధంగా మన జీవకణంలో జరిగే పనులన్నీ డి.ఎన్.ఎ లో ఉండే 'జీన్స్' ఆదేశం లేకుండా జరగవు. డి.ఎన్.ఎ., జీవకణంలో 'న్యూక్లియస్ (Nucleus)' లో క్రోమోసోమ్ లో భద్రపరచబడి ఉంటుంది. ఈ జీన్స్ తమ సందేశాలని ఆర్.ఎన్.ఎ (RNA) అనే పదార్ధం ద్వారా ప్రోటీన్స్ (proteins) అనే పదార్ధాలని సృష్టిస్తుంది. ఈ ప్రోటీన్స్ జీవకణంలోని వివిధ భాగాలకు సరఫరా అవుతాయి. మైటోఖాండ్రియా (mitochondria), రైబోస్'ఓం' (ribosome), గాల్గి బాడీస్ (Golgi bodies), లైసోస్'ఓం', ఎండోప్లాస్మిక్ రెటిక్యులం (endoplasmic reticulum), సైటోసోల్ (Cytosol) అనే వివిధ భాగాలలో జీన్స్ నుంచి వచ్చిన సందేశాలు అమలు పరచబడతాయి. ముప్పయి వేల జీన్స్ కోటికి పైగా రూపాలలో పంపే ఈ సందేశాలను మన జీవకణంలో ఉండే వివిధ భాగాలన్నీ శ్రద్ధతో పాటిస్తున్నాయి.
| Read 31 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|