|
|
Articles: Devotion | సద్గురు సాయి లీలలు - Site Administrator
| |
మంచి ముహూర్తం పెట్టి, ఈ స్థలంలో ఒక రోజు రాత్రి పెద్ద ఎత్తున త్రవ్వకం పని మొదలు పెట్టినాము. రాత్రి ఎనిమిది గంటల సమయంలో 2 లారీలు, 50 మంది పనివారితో ఈ కార్యక్రమం మొదలైంది. ఆ సమయంలో నేను, సత్యనారాయణగారి సెక్రటరీ, రఘు మరియు కావేటి సత్యనారాయణ గారు కలిసి ఆ స్థలం మందు క్రిందనే కూర్చున్నాము. ఈ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. రాత్రి 1 గంట సమయంలో ఫకీరు వేషంలో 75 సంవత్సరముల వయస్సుగల ఒకాయన ఊహించని విధంగా వచ్చారు.
అదే సమయంలో మేము భోజనానికి వెళ్ళే పరిస్థితిలో లేనందున మేము అంతకు ముందే తెచ్చుకున్న పకోడి ఉన్నందున అది తినుచుండగా, ఫకీరు మా ముందు కూర్చొని 'క్యాకరే బేటా' అన్నాడు నాతో. నేను బాబాకా మందిర్ బనారే బాబా అన్నాను. బహుత్ అచ్చా కాం కర్ తే బేటా, తుమారా జన్మ ధన్యు హోజాయెగ అన్నాడు. అంతలో తన చిప్పలో పకోడి వేశాను. బాబా కావో అన్నాను. బాద్ మెకాతుమ్ అని బహుత్ అచ్చా కాం కర్ రె అని రెండు మూడు సార్లు అన్నాడు. మరలా రెండు సార్లు పకోడి వేసినాను. కావో బాబా అని అన్నాను. నా పక్కన సత్యనారాయణగారు నిద్రలో ఉన్నారు. రఘు మరియు కావేట సత్యనారాయణ మేలుకొని ఉన్నారు. రఘు గారు ఇంతర రాత్రివేళ ఎందుకు వచ్చావు వెళ్ళిపో అంటే, నాకు మనస్సులో పెద్ద మనిషిని వెళ్ళిపో అంటే బాగుండదని అనుకొని సత్యనారాయణగారిని నిద్రలేపు అని, అతనిని లేపేలోగా కొన్ని సెకండ్లలో అదృశ్యమయినాడా మనిషి.
సత్యనారాయణ గారు నిద్ర నుండి లేచి బాబా వచ్చాడు మీరు ఏమి చేస్తున్నారు అని నాతో అన్నాడు. వచ్చినది బాబానే అని తెలియడంతో నా శరీరం వణుకుతోంది. ఎంతో తపన, ఎందుకంటే... ఆ సమయంలో నన్ను మరిపించినవాడు బాబాయే. వెంటనే నేను స్కూటర్ తీసుకొని ఉత్సాహంతో రోడ్డంతా గాలించాను ఎక్కడా ఏ ఒక్క మనిషయినా రోడ్డుమీద లేడు. ఆంధ్రబ్యాంక్ మరియు శివం రోడ్ వరకు పోయి వచ్చినాను. కాని ఆ సమయంలో రోడ్ నిర్మానుష్యంగా ఉంది. ఈ సంఘటనతో నా జీవితాన్ని బాబాకు అంకితం చేశాను. రోజు రోజుకూ బాధలనుండి విముక్తి పొందుతూ బ్రతుకుచున్నాను. నేను ఏ గుడికి పోయినా చెతులెత్తి నమస్కరించినపుడు నా మనస్సు మరియు నా కళ్ళలో బాబాయే కనబడతాడు. తరువాత నా యొక్క అనుభవం మరియు భక్తుల అనుభవం ప్రకారం ఈ బాబా మందిరము ఆపదమ్రొక్కుల సాయినాధుడుగా పేరు పొందాడు. ఏ భక్తుడైనా మనస్ఫూర్తిగా వేడుకొని వెళ్ళినవారికి, ఆ భక్తుల కోరికలు ఫలించాయని ప్రతి భక్తుడు అంటాడని నా అనుభవం ప్రకారం నా నమ్మకం.
జై సాయిరాం.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|