|
|
Articles: TP Features | 'మావో' రాజ్యం అబూజ్ మఢ్ - Site Administrator
| |
మరనార్ లో మావోయిస్టులు 'పోటీ ప్రభుత్వాన్ని' నడుపుతున్నారా అని ఎవరికైనా అనిపించవచ్చు. కాని అక్కడ ఉన్న ప్రభుత్వం అది ఒక్కటే. పోటీగా నడిపేందుకు మరొకటి ఏదీ లేదు. అబూజ్ మఢ్ ను 'మారుమూల ప్రాంతం'గా ప్రస్తావించే జగదల్పూర్ లోని పోలీస్ అధికారి ఈ విషయం నిజమేనని సంకేతం వదలుతారు. భారతదేశంలోనే దాదాపు మరొక సార్వభౌమ ప్రాంతంగా ఇది సాగుతున్నది. గుబురు గుబురుగా ఉన్న ఒక చెట్టు కిందకు చేరిన గ్రామ పెద్దలు తుపాకిధారుడైన యువకుని చూసి అంగీకార సూచకంగా తలలు ఊపారు.
'యెహీ సర్కార్ హై, ఔర్ తో క్యూ నహీఁ' (ఇదే ప్రభుత్వం, మరొకటి లేదు) అని వారిలో ఒకడు అన్నాడు. మరొక గ్రామస్థుడు తన అభిప్రాయాన్ని మరింత స్పష్టంగా వ్యక్తం చేస్తూ, 'కాంట్రాక్టర్ అత్యాచార్ బంద్ కియా, సామంతి అత్యాచార్ బంద్ కియా, హమ్కో జంగల్ కా హక్ దియా, జనతన సర్కార్, జిందాబాద్! జిందాబాద్!' (కాంట్రాక్టర్లు, భూస్వాముల దోపిడీని వారు అంతం చేశారు. వారు మా అడవిని తిరిగి మాకు ఇచ్చారు. ప్రజల ప్రభుత్వం వర్ధిల్లాలి) అని అన్నాడు.
హఠాత్తుగా 'లాల్ సలామ్' నినాదాలు పెద్ద ఎత్తున వినవస్తుండగా పాత గ్రామ వృక్షం కూలిపోయే ప్రమాదం కనిపిస్తున్నది. మావోయిస్టులపై విశ్వాసంతోనా లేక భయంతోనా గ్రామస్థులు వారికి మద్దతు ఇస్తున్నారనేది తెలుసుకోవడం కష్టమే. కేవలం నినాదాలతో పని కాకపోవడంతో తమ పరిధిని విస్తరించుకోవడానికి తుపాకుల వాడకానికి తాము అలవాటు పడ్డామని వారిలో హేతుబద్ధంగా ఆలోచించే వారు కొందరు అంగీకరించారు.
'జనతన సర్కార్'కు ఇష్టపూర్వకంగా అండగా నిలబడినవారు ఈ అడవులలో ఉన్నారు. అయితే, అలా కాకుండా ఎలా వ్యవహరించాలో, ఏమి చెప్పాలో తెలియనివారు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. ఈ ప్రాంతానికి కొంత దూరంలో, ఒక పురాతన వాగుకు ఆనుకుని ఉన్న మరొక వాడలో ఒక మధ్య వయస్కుడు గుసగుసలాడుతున్నట్లుగా 'ఇది అత్యంత సంక్లిష్ట పరిస్థితి. కాని నా పాకపై ఎర్ర జెండా పెట్టకుండా నేను ఏమి చేయగలను? వారి వద్ద తుపాకులు ఉన్నాయి. తుపాకులు లేని ప్రభుత్వం ఉండాలని అనుకుంటాను, కాని అది ఎక్కడ కనిపిస్తుంది' అని అన్నాడు. రాయిపూర్, ఢిల్లీలలో నేతలు అందు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనేది అతనికి శుభవార్త. కాని వారు ఇక్కడికి ఇప్పుడప్పుడే రాలేరనేది, లేదనేది అశుభవార్త.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|