|
|
Articles: Short Stories | నేను నా బిఏ! - Miss rajeswari rajeswarinedunuri
| |
'కారున్న మైనరు... కాలం మారింది మైనరు' పాట పాడుతూ ఇల్లూడుస్తున్న నేను నిజంగానే బయట కారాగటం మా మైనర్ బాబు ఈల వేసుకుంటూ తాళాలు గాల్లో విసురుకుంటూ [అదే శ్రీ వారు] లోపలికి రావడం గమనించకపోలేదు.
ఐతే అంతమాత్రాన పాట మాత్రం ఆపదల్చుకోలేదు. ఎందుకంటే అలా పాటతో ఆయన్ని పొంగబెట్టటం వల్ల కొన్ని క్లిష్టమైన పన్ లు చాలా ఈజీగా జరిగిపోతాయి [పాపం ఆ సంగతి మా మైనరుకి తెలియదు లెండి]
'హల్లో డార్లింగ్! ఏమిటి మరీ అంత ఖుషీగా ఉన్నావ్?'
'నా సంగతికేం గానీ... ముందు తమ సంగతి చెప్పండి... కొత్త టైపిస్ట్ ఎవరైనా వచ్చిందా?
లేక బ్రాంచి నిండా లేడీస్ నే వేసుకున్నారా?'
'అవునుస్మీ మంచి ఐడియా. ఎంతైనా నీ బుద్ధి ఉంది చూసావ్... చాలా సునిశితం. నువ్వన్నట్టు కొత్త టైపిస్ట్ వచ్చింది. ఎంత అందంగా ఉందనుకున్నావ్? షార్ట్ హాండ్ రాస్తుంటే ఆమె లాంగ్ ఫింగర్సు ఎంత అందంగా, నాజూగ్గా కదులుతున్నాయనుకున్నావ్? పైగా బి.ఎ. అసలు నా బ్రాంచిలో అందరూ బి.ఎ.లు., ఎం.ఏ.లు. ఈ మేనేజరు గారు పని చెప్పాలే గానీ ఎంత భక్తి? ఎంత వినయం? ఎంత ప్రేమ?
'అవునవును భక్తి వినయం కంటే ప్రేమే ఎక్కువ. ఇకనేం ఇక్కడ మైనరు అక్కడ మేనేజరు.
భలేగా ఉంది మీ పని.'
'మరి మనమంటే ఏమనుకున్నావ్?' అంటూ కాలరు సవరించుకుని ఇంకా ఇంకా చెప్పుకు పోతున్నారు- వాళ్ళ గురించీ వాళ్ళ డిగ్రీల గురించీ.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|