|
|
Articles: Short Stories | నేను నా బిఏ! - Miss rajeswari rajeswarinedunuri
| |
వళ్ళు మండిపోతుంటే... 'అబ్బబ్బా! ఆపండి అది బి.ఎ., ఇది బి.ఎ. వాడి పెళ్ళాం ఎం.ఏ., వీడి పెళ్ళాం పి.హెచ్.డి. ఒకటే గోల. మీకు బి.ఎ. అంటే అంత మోజన్నమాట. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అన్నాను కాస్త సీరియస్ గానే.
'ఏమిటో అది?'
'ఏముందీ? నేను కూడా బి.ఎ. చదువుతాను' అన్నాను చేతిలోని చీపురుకట్టని నేలమీద గట్టిగా కొట్టి.
'నాన్ సెన్స్ నీకిప్పుడు బి.ఎ. ఎందుకు? ఉద్యోగం చేయాలా? ఊళ్ళేలాలా?'
చేస్తాను ఉద్యోగమూ చెయ్యచ్చు. ఊళ్ళూ ఏలవచ్చు.
'అవును ఎందుకు చెయ్యవూ? వాళ్ళనీ వీళ్ళనీ ప్రేమించటానికి?'
'ఏం? తప్పా? ఇప్పుడు మీరు చేస్తున్న పనీ అదేగా? ఒకవేళ ప్రేమించినా మీ లాంటి మేనేజర్ని మాత్రం చస్తే ప్రేమించను.'
అంటే?
ఏముంది? మరో లాంటి క్లర్కుని ఇంకో లాంటి ఆఫీసర్ని. ఎవడూ దొరక్కపోతే అందంగా ఉన్న ఫ్యూన్ని.
ఆపాపు ఇహ వినలేను. ఎవర్నీ ప్రేమించనంటే బి.ఎ. చదివిస్తాను.
ఎంత స్వార్ధం? సరే ముందు బి.ఎ. అప్పటి సంగతి తర్వాత ఆలోచిద్దాం.
తప్ప...దంటావా...డియర్...? డ్రింకు ముఖం పెట్టారు.
అవును తప్పదు. ఈ డ్రింకు ఫేసు అలవాటే గానీ నా బి.ఎ. తప్పదు.
సరే...అల్లాగే...చదువు...గానీ..ముందు..ఆ...చీపురు?
దానికేం...గట్టిగా...ఉంది...ఇవ్వాళే కొన్నాను.
తీరా చదివాక ఉ...ద్యో...గం....అంటే?
అప్పటి సంగతి చూద్దాం? ముందు...బి.ఎ.
చూడ్డం కాదు ఒప్పుకుంటేనే?
లేకపోతే?
డైఓర్స్?
మరి పిల్లలు?
ఒకటిన్నర...ఒకటిన్నర
అదెలా ?
అబ్బబ్బా ! ముందు బి.ఎ. అవనీ తరవాత.
సరే ఇవ్వాళ సినిమాకొస్తే...
మళ్ళీ పరీక్షలయ్యేంత వరకు అడగొద్దు.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|