|
|
Articles: My Thoughts | సాహసిక సమాజం - Site Administrator
| |
'మనసుకు మంచివారము - మాపటికి దొంగవారము'
'చీకటికొండన సిగ్గేలేదు - అవతలికొండన లజ్జేలేదోయీ' అంటూ కవ్వించే స్వైరవిహార ధీరలు.
తియ్యమామిడి గండిలో గయ్యాళి ఆడపడుచులు
కల్లుగీసే చిన్నతమ్ముడిని ఎగరేసుకుపోయే 'వేనపుడేగలు'
'చింకులు బొంకులు సింగారించుకుని మగని జాడవెళ్ళే' అభిసారికలు
'బందమామిడి బయలులో బయలుదేరిన గేదెపోతులు'
'నల్లసామల లంకలలో నెలవుగొన్న నెమలి పిట్టలు'
'గుండెనిండ వలపులున్న కున్నెపిట్టలు'
'నూనెకొప్పుల పొన్న చిలుకలు', 'బొంతచాటు బొబ్బరగువ్వలు' - ఎందరో తారుణ్య లావణ్య జృంభితలై మదవతులు
'కాచిపూచె కన్నెవయసు - కాయలేము కన్నవార' అని పెళ్ళి కోసం గొడవచేసే గుబ్బట్లు
'పొగలు బండికి పారిపోగా - పదాలు మరిదిని పిలవబోదాం' అంటూ తెగించి ఘాటుదీగే మగువలు
బలవంతంగా లాక్కొచ్చిన వాడికి లొంగక 'కులముతోడి చెప్పుకునే వేడుకల ముంగిపిల్లలు'
'మంచాన లేడమ్మ, కంచాన లేడు - ఏడత్త - నీ కొడుకు ఎందుబోయేడు
మంకు గుణమని మగువలొల్లడు - చేటు గుణమని చేడెలొల్లడు' అని నిలదీసే కొత్తకోడళ్ళు.
'అత్తమామ మాటలకు ఈతవేనం తేలిపోయే మగనాళ్ళు' వారికి చేరువయ్యే జతగాళ్ళు,
- మగనాలి తగవు తెగిన తరువాత పాత, కొత్త భర్తలకు ఆమె ఇచ్చే 'కొల్లువిందు'
పిల్లల మీద హక్కు తనదే అని పట్టుపట్టే 'చిలకమ్మలు,' మారుతున్న ఉత్పత్తి సంబంధాలు.
కళ్యాణపు లోవలో దొంగపెళ్ళిళ్ళు చేసుకొనే దేశిరాజులు - దుర్గాండ్లు, యువరాజును వలచి, వలపించుకున్న మాలగంగు, ఆసివేయులదేశం చూద్దామని వచ్చి కొండనాయుడిని వరించి పుట్టలో నెలవైన నందమ్మ, ఉగ్రనరసింహుడిని చుట్టూ తిప్పుకున్న చెంచిత, సజీవమైన ఈ పాత్రల ఉద్వేగాలు, ఆరాటాలు, అనుభవాలు, ఆదర్శాలు, వ్యవస్థలోనే వారు వెదుక్కొనే అవకాశాలు, పరిష్కారాల ముందు, కాల్పనిక సాహిత్యంలో మధ్య తరగతి విలువల మధ్య నలిగిపోయే పాత్రల పిరికితనం - వాళ్ళ పలాయన ధోరణులు - చాలా పేలవంగా కనిపించేవి.
సమాజం మూలాలు వెతుక్కుంటూ పాశ్చాత్య పండితులు, కళాకారులు ఆదిమ జాతుల అధ్యయనానికి పూనుకుంటే మన రచయితలు, వారి పాత్రలు ఆశ్రమాలు గురువుల దగ్గరకు చేరుతుంటారు. లేదా గతాన్ని వెతుకుతూ లంగరందక బోర్లాపడుతుంటారు. ప్రకృతిని, సమాజాన్ని గమనించి పాశ్చాత్యులు తమ శాస్త్రాలను అభివృద్ధి చేసుకుంటే, అనువాదాలు, పలాయన, తిరోగమన ధోరణులు, పిడివాదాలలో మన బుద్ధిజీవులు పొద్దుపుచ్చుతుంటారు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|