|
|
Articles: TP Features | మన భాషను ప్రేమిద్దాం - Site Administrator
| |
ఇంతేకాదు... మన పొరుగువారు ఇలాంటి విషయాల్లో ఏం చేస్తున్నారో మనం ఆలోచిస్తున్నామా? ప్రతిరోజూ వస్తున్న కొత్త కంప్యూటర్ పదాలను, సాంకేతిక పదాలను తమ భాషలో చెప్పడానికి, అవసరమైతే సృష్టించడానికి తమిళ సోదరులకు ప్రభుత్వం, ప్రభుత్వేతర స్థాయిల్లో వ్యవస్థలున్నాయి. ఇందుకోసం ఒక వెబ్ సైటే ఉన్నది. మరి, మన భాషా నిపుణులు ఈ ప్రయత్నంలో ఏ దశలో ఉన్నారు? ఇలాంటి వ్యవస్థ కల్పనకు సంబంధిత ప్రభుత్వ సంస్థలు, సంఘాలు ఏం చేస్తున్నట్లు?
తెలుగు నిఘంటువులంటేనే సంస్కృత పదాలకు తెలుగు అర్థాలను చెప్పేవిగానో, పిల్లి అంటే మార్జాలమన్నట్లు వివరించేవిగానో ఉన్నాయని, సమగ్రమైన తెలుగు నిఘంటువు కావాలని ఎంత ఘోష పెడుతున్నా ఇంతవరకు సాధించింది ఏమిటి?
ఇవన్నీ చేయకుండా వార్తాపత్రికల్లో, జన ప్రసార మాధ్యమాల్లో తెలుగుపదాల ప్రయోగం తగ్గి, ఇంగ్లీషు వాడకం పెరిగిపోతోందని మొత్తుకోవడం ఎంతవరకు సబబు? ప్రభుత్వం నుండి, రచయితల నుండి, భాషోద్యమకారుల నుండి చొరవ, కృషి ఉంటే జన మాధ్యమాల్లో మార్పు అసాధ్యమైనదేమీ కాదు. నిజానికి నేడున్న పరిస్థితుల్లో తెలుగు చదువుకోలేని, రాయలేని కోట్లాది తెలుగు జనావళిలో దేశంలోనూ బయటా తెలుగును కాపాడుతున్నవి ప్రచార, ప్రసార మాధ్యమాలే. ఇతర అన్ని భాషల్లో వలె, తెలుగు ప్రచార, ప్రసార మాధ్యమాలపైన కూడా ప్రపంచీకరణ, మార్కెట్ శక్తుల తీవ్ర ప్రభావం ఉంది. ఈ వాస్తవాన్ని గుర్తించి మన మాధ్యమాల్ని మనం సానుకూలంగా మలచుకోవాలి తప్ప అడ్డదిడ్డంగా విమర్శించడం తగ్గించాలి.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|