|
|
Articles: Short Stories | పొయెట్రీ ఆఫ్ లైఫ్ - Miss vijayalakshmi vijayalakshmi
| |
మా వాడికి అదో రకమైన జబ్బు చేసింది. అఫ్ కోర్స్! ఇదే రకమైన జబ్బు ఆయనెవరో రాజకీయ నాయకుడికి కూడా ఉండేదట. రాజకీయ నాయకుడికీ జబ్బున్నా పెద్ద ప్రమాదమేం లేదు. పేపర్లు ఘనంగా ఆ విషయం ప్రచారం చేసి, ఆ తరవాత నోళ్లు మూసుకున్నాయి. రాజకీయ నాయకుడి విషయంలోనైతే అదో సరదాగానూ విడ్డూరంగానూ చెప్పుకుని ప్రజలు నవ్వుకున్నారు. కాని మా వాడి విషయంలో అలా కాదే?! వీడింకా ఎంతో భవిష్యత్తు ఉన్నవాడు. ఎమ్.ఎ. ఫస్టు క్లాసులో పాసైన వాడు. నిరుద్యోగి. ఇంకా పెళ్లి కాలేదు. ఈ జబ్బు విషయం తెలిస్తే, ఇంక వీడికెవరైనా పిల్లనిస్తారా?! వీడి మగతనంలో ఏదో లోపముందని నలుగురూ ఆడిపోసుకోరూ?? అసలే ఆఫీసు పనుల్లో ఉక్కిరి బిక్కిరిగా తలమునకలై ఛస్తూంటే, ఇదో కొత్త సమస్య వచ్చిపడింది. ఏం చెయ్యటానికీ పాలు పోవటల్లేదు.
రాత్రి నా శ్రీమతి చెప్పింది- 'ఏమండీ! వీడి జబ్బు రాను రానూ ముదిరిపోతోందండీ! ఎప్పుడెలా ప్రవర్తిస్తాడో తెలీకుండా ఉంది. ఇంత కాలం లంగాలు కట్టుకోవడం, చీరెలు చుట్టబెట్టుకోవడంతో సరిపెట్టుకునే వాడు. నిన్న రాత్రి ఒక చెవికి జుంకా తగిలించుకుని పెదాలకు లిప్ స్టిక్ పూసుకుని పడుకున్నాడు.. ఎవరికైనా ఈ విషయం తెలీక ముందే ఏదో ఒకటి చెయ్యాలి.'
'రేప్పొద్దున్న నాకాఫీసులో ఇన్ స్పెకషన్ ఉంది. నువ్వే ఎలాగో వాడికి నచ్చ చెప్పి డాక్టరు దగ్గరకి తీసికెళ్లు ' అన్నాను.
'రేపు మంగళవారం కదండీ. మనూరి భూత వైద్యుడికి చూపించనా అంది శ్రీమతి.
నాకు ఛిర్రెత్తుకొచ్చింది. 'నా బొంద. భూత వైద్యుడి దగ్గరకి నిన్నెవడు తీసికెళ్లమన్నాడే? మన ఫ్యామిలీ డాక్టరు దగ్గరకి తీసికెళ్లు' అన్నాను.
మర్నాడు మా వాడ్ని ఆస్పత్రికి తీసికెళ్లినట్టుంది నా భార్య. ఆ రాత్రి ఎంతో ఆనందంగా గుసగుసలుగా నా చెవిలో చెప్పింది- 'ఏవండీ! మనవాడి మగతనంలో ఏ లోపం లేదుటండీ. వాడికి అసలే రోగం లేదుట. పూర్తి ఆరోగ్యంగా ఉన్నాట్టండీ' అని.
నా మనసుకు కొంత ఊరట కలిగినా సందేహంగా అడిగాను- 'మరైతే వాడెందుకలా ప్రవర్తిస్తున్నాడంటావు?' అని.
'ఒకవేళ ఎవరైనా చేతబడి చేశారేమోనని నాకనుమానంగా ఉందండీ' అంది.
'ఛ నోర్ముయ్!'అన్నాను కోపంగా నేను.
'మీరలాగే అంటారు. చేతబడులూ ఉన్నాయి- బాణా మతులూ ఉన్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఇదేదో ఇటువంటి బాపతే అనే అనుమానం నాకుంది. ఎందుకైనా మంచిది ఒకసారి ఎవర్నైనా పెద్ద మంత్రగాడ్ని పిలిపిద్దాం. ఏమంటారు?' అంది నా శ్రీమతి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|