|
|
Articles: Short Stories | పొయెట్రీ ఆఫ్ లైఫ్ - Site Administrator
| |
'ఒరే సోమూ! మగాడివి కాదట్రా? నాయన్నాయనా! నేను గుళ్లోకెళ్లాలి. కొంచెం చెట్టెక్కి నాలుగు కొబ్బరికాయలు దింపరా. చచ్చి నీ కడుపున పుడతాను' అంతుంది బామ్మ. 'ఒరే సోమూ అసలే నీరసంతో చచ్చిపోతున్నాన్రా! తల్లికి ఆ మాత్రం సాయం చేస్తే తప్పేంలేదు. రేప్పొద్దున్న పెళ్లయ్యాక నీ లాటి వెధవాయలే పెళ్లానికి ఇల్లూడ్చి, కూరలు తరిగి, వంటలు కూడా చేసిపెడతారు. నేను చెప్పేది ఏమంత కష్టమైన పనని? మగాడివి కాదూ? పది బకెట్ల నీళ్లు తోడిపెడితే అరిగిపోతావా కరిగిపోతావా?' అంటుంది అమ్మ. 'ఒరే సోమూ! సిగ్గు లేదురా? మగాడివి కాదురా? ఆడదిగా పుట్టిన నీ చెల్లాయి కన్నా, నీకు లెక్కల్లో నాలుగు మార్కులు తక్కువొచ్చాయంటే నువ్వెందులోనైనా దూకి చావాలిరా! సర్లె ముందు బజారుకెళ్లి కూరలు పట్రా' అంటాడు నాన్న.'
'నువ్విలా నన్ను కూరలకీ వాటికీ బజార్లంట తిప్పుతుంటే నేను రేపు పరీక్ష ఫెయిలయ్యి ఇంట్లో కూర్చుంటాను' అని నేనంటే, 'నోర్ముయ్యరా వెధవా! మగాడివై పుట్టాక బజారు పన్లు నువ్వు చెయ్యకుంటే, చెల్లాయెళ్లి చేస్తుందనుకుంటున్నావా? మగాడన్నాక అన్నింట్లోనూ ఉండాలి. మా కాలంలో మేము చదువుకునే రోజుల్లో మేము ఆటల్లో ఫస్టు. బజారు పనులు చెయ్యటంలో ఫస్టు. ఈ కాలం కుర్రాళ్లు మీరూ ఉన్నారు. ఎందుకూ పనికిరాని ఆడంగి వెధవల్లా తయారయ్యారు' అనే వాడు నాన్న. అప్పుడు నేను 'అవును. మగాడిగా పుట్టినందుకే గదా నాకీ శిక్ష! అదే ఆడదాన్నై పుట్టుంటే మీరు నన్నిలా చంపుకు తినేవారా?'అనేవాడిని.దానితో మా నాన్న-
'అవున్రా! అసలు నువ్వు ఆడదై పుట్టి, నీ చెల్లాయి మగాడై పుట్టుంటే మాకీ బాధలుండేవి కావురా. నోరు మూసుకుని మగాడిగా పుట్టినందుకు చెప్పిన పన్లు చెయ్యి' అనే వాడు నాన్న.
'ఇంక మా చెల్లి - 'అయ్యో మర్చేపోయాన్రా అన్నయ్యా! ఇందాకే నువ్వు బజారెళ్లి వచ్చావా?! ఒరే, టైలరు దగ్గరకెళ్లి నా లంగాలు కుట్టాడేమో అడిగి తెచ్చెయ్యరా' చచ్చీ చెడీ నేను బజారెళ్లి లంగాలు తెస్తే, వాటిల్లో ఏవో లోపాలు చూపించి, సైజు చేయించుకు రమ్మని పంపేది. ఇలా బజార్నించొచ్చానో లేదో - మళ్లీ 'ఒరేయ్! అన్నాయ్! ఇంట్లో ఉందనే అనుకున్నాన్రా. సూది ఎంత వెతికినా కనిపించి చావలేదు. కొంచెం తెచ్చిపెట్టరా. చీరకి ఫాల్ కుట్టుకోవాలి' అనేది. అందరూ అన్నీ ఒకేసారి చెప్పరు. ఇంటి నించి రెండు మైళ్ల దూరంలో ఉన్న బజారుకు పదే పదే పంపుతారు. అంతే కాదు ఇంటికొచ్చిన చుట్టాలు కూడా క్షణక్షణానికీ 'మగాడు' అని గుర్తుచేస్తూ అడ్డమైన పనులూ చేయించుకునే వారు.'
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|