|
|
Articles: TP Features | వెయ్యి కళ్ళ యుఐడి! - Site Administrator
| |
(దుర్గం రవీందర్)
యుఐడి నంబర్ అంటే యూనిక్ ఐడెంటిటీ నంబర్ (ప్రత్యేక గుర్తింపు నంబర్). ఇది 16 అంకెల నంబర్. ఈ నంబర్ తో భారతదేశంలోని ప్రతి పౌరుడు ఒక గుర్తింపు పొందుతాడు. ప్రతి పౌరుడికి ఒక నంబరు ఇస్తారు. తల్లిదండ్రులు పెట్టిన పేరుతో పాటు అన్ని అధికారిక, అనధికారిక లావాదేవీల్లో ఈ నంబర్ ను పేర్కొనడం తప్పనిసరి అవుతుంది. కొన్నిసార్లు తల్లిదండ్రులు పెట్టిన పేరు లేకుండానే ఈ నంబర్ తో వ్యవహారాలు జరిగిపోతాయి. క్రింది స్థాయి పోలీసులను, సైనికులను పై అధికారులు పేరుతో కాకుండా నంబర్ తో గుర్తిస్తారు. అదే పద్ధతిలో ఇక రాజ్యం అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తన పౌరుడిని పేరుతో కాకుండా నంబర్ తో గుర్తిస్తాయి. నంబర్ తోనే పిలుస్తాయి. నంబర్ లేనివారిని దేశం తన పౌరులుగా గుర్తించడానికి నిరాకరిస్తుంది. ఇదంతా పౌరుల సంక్షేమం, పరిపాలనా సౌలభ్యం కోసమే చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది.
మన దేశంలో పౌరులందరికీ నంబర్లు ఇచ్చి, గుర్తింపు కార్డులను జారీచేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక 'అథారిటీ' 'యూనిక్ ఐడింటిఫికేషన్ డాటా చే అథారిటి ఆఫ్ ఇండియా' (యుఐడిఎఐ)ని ఏర్పాటు చేసింది.
2009 జూన్ 4న రాష్ట్రపతి యుఐడి పథకాన్ని గొప్పగా ప్రస్తుతిస్తూ ప్రకటించారు. లక్షన్నర కోట్ల ఖర్చుతో దేశంలో ప్రతి ఒక్కరికి ఈ నంబర్ ఇవ్వడం ప్రాజెక్టు ఉద్దేశ్యం అని వెల్లడించారు. ఆరు పెటాబైట్స్ సామర్థ్యంతో దాదాపు వంద కోట్ల జనాల బయోమెట్రిక్, ఇతర వివరాలు ఇందులో నిక్షిప్తం అవుతాయి. కేవలం నాలుగు సెకన్లలో కోరిన వ్యక్తి వివరాలు లభిస్తాయి. ఈ వివరాలను సంక్షేమ ఆర్థిక, భద్రత తదితర రంగాలలో ఉపయుక్తం అవుతాయి అని ప్రభుత్వం చెబుతున్నది. ఇన్ని వివరాలతో ఇంత పెద్ద స్థాయిలో ఇలాంటి ప్రాజెక్ట్ లో ప్రపంచంలో మరే దేశమూ చేపట్టలేదు.
అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలలో పౌరులందరికీ కూడా ఇలా నంబర్లు ఇచ్చే పద్ధతి ఉంది. అమెరికాలో దీన్ని 'సోషియల్ సెక్యూరిటీ నంబర్' అని అంటారు. ఆ దేశపౌరుడు ఎవరైనా నాకు ఉద్యోగం లేదు, నేను నిరుద్యోగిని అని వెల్లడించుకుంటే ప్రభుత్వం ఆ వ్యక్తి జీవనానికి సరపడా నిరుద్యోగభృతిని చెల్లిస్తుంది. ఇలాంటి పలు రకాల పౌర సంక్షేమ కార్యక్రమాలను అమెరికా ప్రభుత్వం చేపడుతుంది. పన్ను వసూలు, సంక్షేమ కార్యక్రమాలు కూడా అక్కడ కొంత పకడ్బందీగా జరుగుతాయి. ఆస్ట్రేలియాలో పౌరులు తమ పిల్లల్ని బడికి పంపినందుకు ప్రభుత్వం నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తూ, పిల్లల ఖర్చుల నిమిత్తం నెలనెలా ఇంటికి చెక్ పంపిస్తుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|