|
|
Articles: TP Features | వెయ్యి కళ్ళ యుఐడి! - Site Administrator
| |
ఈ ప్రాజెక్టు అమలు విషయంలో మేధావులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీని ఖర్చు విషయంలో కూడా సందేహాలున్నాయి. లక్షా యాభై వేల కోట్లు అంచనాతో ప్రారంభం అవుతున్న ఈ ప్రాజెక్టులో అవినీతి ఉండదని ఎవరూ అనుకోవడం లేదు.
రాబోయే కాలంలో పాస్ పోర్టు కావాలన్నా, బ్యాంకులో ఖాతా తెరవాలన్నా, పన్ను కట్టాలన్నా డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా, బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ పొందాలన్నా, మ్యారేజ్ రిజిస్ట్రేషన్, హాస్పిటల్ లో చికిత్స కావాలన్నా, ఇన్సురెన్సు పాలసీ కావాలన్నా, రైలు, సినిమా, టికెట్ల కోసం చివరికి స్మశానంలో అంత్యక్రియలు జరగాలన్నా, యుఐడి నంబర్ తప్పని సరిగా కావాల్సి ఉంటుంది.
పౌరుల అధికారిక లావాదేవీల, పత్రాలన్నింటిలో యుఐడి నంబరును పేర్కొనాలి. ముందో వెనకో ప్రతి ఒక్కరూ ఈ నంబరు పొందాల్సి ఉంటుంది. వివిధ ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, మంత్రిత్వ శాఖలతో సహా బ్యాంకులు, బ్యాంకులు, ప్రయివేట్ సంస్థలు జరిగే అన్ని వ్యవహారాల్లో ఈ నంబర్ తప్పనిసరి అవుతుంది. ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల డేటా బేసుల్లో యుఐడి నంబరును వాడటానికి ఒప్పుకున్నాయి. యుఐడితో నల్లధనానికి కూడా చెక్ పెట్టొచ్చని, తద్వారా భారీగా పన్నులు వసూలు అవుతాయన్నది కూడా ప్రభుత్వ ఉద్దేశ్యం.
సంస్థ పేరులోనే దాని స్వభావం స్పష్టం అవుతున్నది. అథారిటీ అనే పదం ఆ సంస్థ పేరులో రావడం యాదృచ్ఛికం ఏమీ కాదు. అథారిటీ అంటే 'పన్నులను ముక్కుపిండి వసూలు చేయడానికే' అనే అర్థాన్ని అందులో ఇమిడ్చినట్లు ప్రజలు అర్థం చేసుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం అని కొందరు అభిప్రాయ పడుతున్నారు.
దేశంలోని ఇతర ప్రాంతాలలో ఎలా ఉందో గాని, ఆంధ్రప్రదేశ్ లో ఒక గృహస్తుకు విద్యుత్ కనెక్షన్ కావాలంటే విద్యుత్ శాఖ వారి నమూనా దరఖాస్తు ఫారంలో రెండు ఫోటోలు అతికిస్తూ, ఇంటి రిజిస్ట్రేషన్ దస్తావేజుల జిరాక్స్ కాపీలను జతచేసి డివిజనల్ ఇంజనీర్ కు నివేదించుకోవాలి. దరఖాస్తు పరిశీలించిన ఆయన గృహస్తును ఒకసారి కరెంట్ ఆఫీసుకు రమ్మని పిలుస్తాడు. అక్కడ దరఖాస్తుదారు నిలబడి ఐరిస్ ఫోటో దిగాలి. అయితే దొంగల మాదిరి పలక మీద గృహస్తు పేరు రాసి అది కనపడేలా పట్టుకుని నిలబడి ఫోటో దిగమని మాత్రం అడగరు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|