|
|
Articles: Short Stories | షిఫ్ట్ డ్యూటీ - Site Administrator
| |
పురుషుడికి సుఖాన్ని పంచాలన్నా, పురుషుల్ని ఏకత్రాటిపై నడిపించాలన్నా అది ఒక్క స్త్రీకే సాధ్యమనుకున్నా! ఒక రోజున అహల్య దగ్గర నేను నా డ్యూటీలో వుండగా, అహల్య ఆనందాబరపుటంచుల్ని తాకుతూ-'ఓహ్!రాజా!నా రాజా!!'అంది. నేను అనుమానంగా -'ఎవరా రాజ' అని అడిగాను. ఎందుకంటే మా రూమ్ కెదురుగానున్న మేడలో 'రాజు 'అనే బ్రహ్మ చారొకడున్నాడు. వాడు చాలా ధనికుడే. అయినా యోగం బాగుండక బ్రహ్మ చారిగా వుండి పోయాడు. 'ఇద్దర్ని మరిగిన అహల్య మూడో వాడికోసం ఎగబడకుండా వుంటుందా?' అనే ఆలోచన నా మెదడు అట్టడుగు పొరల్లో కదలాడింది. అందుకే అలా అడిగాను. 'హయ్యో రామా!ప్రతిదానికీ అనుమానమేనా?'ఈసడింపుగా అందహల్య. 'ఆ రాముడెవరు మళ్లీ' అని నేను రెట్టించాను. 'దేవుడిని తల్చుకోవడం కూడా తప్పేనా? నా మదన సామ్రాజ్యానికి నువ్వు రాజైనప్పుడు నిన్ను, 'రాజా నా రాజా' అని పిలుచుకోవడం కూడా తప్పేనా? అందహల్య. మరి నేనేం మాట్లాడగలను?
మా తాతల కాలంలో 'ఇద్దరు పెళ్లాల ముద్దుల మగడ'నే సామెత వుండేదట. ఇప్పుడహల్యో 'ఇద్దరు భర్తల మురిపాల భార్య-సుద్దులు చెప్పే ముద్దుల ప్రియురాలు!!'అలాగంటూ నేననేక మార్లు అహల్యని ఉడికించే వాడ్ని. అలా నాలుగేళ్లు మేమిద్దరు భర్తలం అహల్య దగ్గర మా షిఫ్టు డ్యూటీని కంటిన్యూ చేశాం. ఒకరోజు నేను ఫాక్టరీ డ్యూటీలో వుండగా శివుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు.'ఒరే కేశవా! కొంప మునిగిందిరా! మన పెళ్లాం రాజు గాడితో లేచి పోయిందిరా!' అన్నాడు భోరుమంటూ. నా నెత్తిన పిడుగు పడ్డట్టయింది. శివుడ్ని తీసుకుని ఆదరా బాదరాగా రాజుగాడింటికి పరిగెత్తాను- 'ఇదేమైనా న్యాయమా?' అనడగాలని. అహల్యని మేమెంతో ప్రేమగా చూసుకున్నాం. ఒక్కరమే అయితే అమెను పోషించ లేక పోవచ్చు గానీ, మేమిద్దరు మగాళ్లం! ఆమె కేం కావాలనా కాదనకుండా సమకూర్చగల సమర్థులం.
అయితే..., మమ్మల్ని కాదని అహల్య రాజుతో ఎందుకు లేచి పోయిందో నా కర్థం కాలేదు. మేము రాజింటికి వెళ్లే సరికి మా కోసమే ఎదురు చూస్తున్నట్టు అహల్య కుర్చీలో కూర్చునుంది. ఆ పక్కనే మరో కుర్చీలో రాజు కూర్చునున్నాడు. అక్కడ అహల్య చెప్పిన మాటలకి మేమిద్దరం స్థాణువుల మైనాము. 'నేను మీ ఇద్దరి పైనా జాలి పడిన మాట వాస్తవం. మా అమ్మకి మీరు కట్న మిచ్చుకున్నారని నేను మీ దగ్గరకి రాలేదు. ఏదో మీ బ్రహ్మ చర్యాన్ని వదిలించాలనుకున్నాను. అంతే! మరు జన్ముంటుందో లేదో తెలీదు. ఈ జన్మలో మీకు దాంపత్య సుఖాన్ని చవి చూపాలను కున్నాను. చూపించాను'. కన్నె చెఱ విడిపించానని గొప్పలు చెప్పుకునే మగాళ్లుండే వారట పూర్వం. ఇప్పుడు అహల్య మా బ్రహ్మ చర్యాన్ని వదిలించానని గర్వ పోతోంది. మేమవాక్కై ఆమె మాటల్నే వింటున్నాం.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|