|
|
Articles: Short Stories | భగవద్దర్శనం - Mr. Pratap Cherukuri Pratap
| |
శిష్యునికి వచ్చిన సందేహం విని మహర్షుల వారు ఎంతో సంతోషించి భగవంతుని సర్వ వ్యాపకత్వం గూర్చి మరింత విపులంగా తెలియజెసి , ఆఖరులో 'ఆ భగవంతుని దర్శించాలన్న నీ కోరిక చాలా పవిత్రమైనది మరియు ఉన్నతమైనది. అయితే కేవలం కోరిక వుంటే సరిపోదు. ఆ సర్వేశ్వరుడిని దర్శించాలన్న ఆకాంక్ష తీవ్రంగా వుండాలి. అప్పుడే భగవద్దర్శనం ప్రాప్తమౌతుంది' అని ఉద్భోదించారు.
'నాకు ఆ దేవుడిని దర్శించాలన్న కోరిక చాలా ఎక్కువగా వుంది గురుదేవా! మీ తప:శ్శక్తితో ఎట్లాగైనా నాకు ఆ ప్రాప్తం కలుగజేయండి' అని ప్రార్ధించాడు రామశాస్త్రి.
శిష్యుని మాటలు విని చిన్నగా మందహాసం చేసి 'తప్పకుండా నాయనా! సమయం వచ్చినప్పుడు తప్పకుండా దర్శనం చేయిస్తాను' అని అన్నారు మహర్షుల వారు.
ఆ సమాధానంతో అప్పటికి సంతృప్తి చెందినా ప్రతీ రోజూ భగవంతుడు ఎలా వుంటాడా అని ఆలోచించసాగాడు రామశాస్త్రి. భగవంతుడు ఏ రూపంలో వుంటే ఈ విశ్వమంతటా వ్యాపించి వుండగలడు? ఆ రూపాన్ని ఒక్కసారి దర్శిస్తే గాని తన సంశయం తీరదని ధృఢంగా నిశ్చయించుకున్నాడు. అదే విషయాన్ని మహర్షుల వారిని పదే పదే అడగసాగాడు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|