|
|
Articles: TP Features | 'టి' ఎందుకు ఇస్తుందంటే.. - Site Administrator
| |
జనం అసంతృప్తితో ఉద్యమంగా ఎగసిపడినప్పుడు ప్రజల నుండి ప్రశ్నల పరంపర ఎక్కువైనప్పుడు, రాజ్యం వాటిని అణచడానికి, రకరకాల అనైతిక, అమానవీయ పద్ధతులను అనుసరిస్తుంది. నాయకులను కొనడానికి ప్రయత్నిస్తుంది. విడదీసి బలహీన పరుస్తుంది. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. నిర్బంధం విధిస్తుంది. నిధులు, ఆలోచనలను తానే సరఫరా చేసి ఉద్యమాన్ని ఒక దశకు ఎత్తుకు తీసుకువెళ్ళి నిధులను హఠాత్తుగా ఆపివేస్తుంది. లేదా ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తుంది. కౌంటర్ ఉద్యమాలు నడుపుతుంది. ఉద్యమ నాయకుల్ని చీల్చి వేస్తుంది. మీడియాలో, పాలిటిక్స్ లో స్పేస్ లేకుండా చేస్తుంది. 'ఇగ్నోర్' చేస్తుంది. చేయిస్తుంది. ఆలోచనలను కలుషితం చేస్తుంది. స్పింటర్ గ్రూపులను ఏర్పాటు చేస్తుంది. తాత్విక చింతనలో విషం కలిపి గందరగోళ పరుస్తుంది. కోవర్ట్ లను ప్రోత్సహిస్తుంది. ద్రోహులను చేరదీస్తుంది. ఈ చిట్కాలు ఏవీ పనిచేయకపోతే చివరికి బలంతో అణచాలని చూస్తుంది. ఉద్యమకారుల్ని, నాయకులను చంపివేస్తుంది. అంతే కాని అధికారం దిగివచ్చి ఉద్యమకారుల డిమాండ్ లను సాధారణంగా పరిష్కరించదు. వారికి తల వంచదు.
ఏ ఉద్యమంలో అయినా సాధారణంగా విద్యార్థి నాయకులు అమ్ముడుపోరు. అమ్ముడుపోయే కొందరు బలహీనుల వెల చాలా స్వల్పంగా ఉంటుంది. ఎమోషనల్ బీయింగ్స్ అయిన విద్యార్థి సంఘ నాయకుల ఎమోషన్స్ ఎగదోసి చల్లార్చి వారిని మేనేజ్ చేయాలని యత్నిస్తుంది. రాజకీయ ఉద్యమ నాయకుల ఈ జాడ్యం సర్వసాధారణం. వీరి వెల కొంచెం ఎక్కువగా ఉంటుంది. వేరే రూపంలో ఉంటుంది. చెన్నారెడ్డి, చిన్నారెడ్డి, కేసీఆర్ లాంటి పెద్ద నాయకుల వెలలు ఇంకో రీతిగా ఉంటాయి. ఒకటి రెండు కేంద్ర మంత్రి పదవులు, రాష్ట్ర మంత్రి పదవి ఇస్తే సరిపోతుంది. దీనికి తోడు కొన్నిసార్లు అదనంగా కొన్ని కోట్ల రూపాయలు సరిపోతాయి. సమైక్య రాష్ట్రానికి నిన్నే ముఖ్యమంత్రిని చేస్తాను అంటే ఎంతటి ఉధృత ఉద్యమాన్ని అయినా నాయకుడు ఆపడానికి, అమ్మడానికి సిద్ధపడతాడు. అలనాడు చెన్నారెడ్డి, ఇటీవల 2004లో కేసీఆర్, అప్పుడే చిన్నారెడ్డి తదితరులు చేసింది ఇదే.
ఇలా చేయకపోతే ఆ నాయకులు ప్రభుత్వంతో యుద్ధాలు చేయవలసి ఉంటుంది. యుద్ధాల పర్యవసానం తీవ్రంగా ఉంటుంది. గెలిస్తే నిజంగా నాయకుడు అవుతాడు. జేజేలు అందుకుంటాడు. ఓటమికి లేదా చావుకు కూడా సిద్ధపడాల్సి ఉంటుంది. అందుకే సాధారణంగా ఇలాంటి యుద్ధాలకు బడా నాయకులు, ఈ కాలపు నాయకులు అస్సలు సిద్ధపడరు. సాధారణంగా ఈ యుద్ధాల్లో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండవు కాబట్టి నాయకులు యుద్ధాలు చేయరు. తెలంగాణ ఉద్యమం ఊపు అందుకొని పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటి ఏర్పడిన ఈ సందర్భంలో ఏ ఒక్క నాయకుడో, పార్టీనో ఉద్యమాన్ని నీరుగార్చే అవకాశం తక్కువగా ఉంది. ఇక్కడ విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ వీరిని ఒక కంట కనిపెడుతూ ఉన్నది.
| Read 5 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|