|
|
Articles: My Thoughts | జనమాధ్యమాల్లో తెలుగు - Site Administrator
| |
ఈ నేపథ్యంలో తెలుగు భాష, శైలి, వ్యక్తీకరణ, నుడికారం, కొత్త పదాల వినియోగం గురించి మనం తప్పక ఆలోచించాలి. అదే సమయంలో కొంగ్రొత్త శైలి రూపుదిద్దుకోవడం, నూతన పదసృష్టి జరగడం గురించి కూడా మనం గర్వంగా చెప్పుకోవాలి. వస్తువు ప్రధానమే అయినా... జనమాధ్యమాల్లో తెలుగు ఎలా ఉంది? ఎలా ఉంటే బాగుంటుంది? ఏ ప్రయోగం వల్ల ఆ ప్రయత్నం రక్తికట్టింది? ఏ పోకడ వల్ల వ్యక్తీకరణ రసాబాస అయ్యింది...? వంటి విషయాలు చర్చించుకోవడం ప్రధానం అని భావిస్తున్నాం. నిజానికి జన మాధ్యమాలను బుల్డోజర్లతో పోలుస్తుంటారు. చెరువులోని నీటినంతటినీ ఒకేసారి పరీక్షించడం సాధ్యం కాదు, అలాగే.... జన మాధ్యమాల భాష వినియోగం గురించి పరిశీలించడం ఏ ఒక్కరితో లేదా కొంత మందితో ఏకకాలంలో వీలుపడదు. అలాగే... సమగ్రంగా పరిశీలించడమే సాధ్యపడదు. ఎందుకంటే జనమాధ్యమాల గతిశీలం విశేషమైంది. నిజానికి ఆ వేగం ఆ మాధ్యమాలకు కూడా బోధనపడదు.
మరి అందులో భాష విషయంలో దోహదమో... లేదా ద్రోహమో కూడా తెలీని రీతిలో ఆయా సిబ్బంది ఉన్నారని మనం భావించుకోవాలి. వారికి తమ ప్రయత్నాలను పరిశీలించుకునే సమయం గాని, అవకాశం గాని లేదని మనం అంగీకరిస్తూనే వారికి భాషపట్ల ఉన్న చిత్తశుద్ధిని కూడా శంకించాలి.
అందువల్లనే పత్రికల్లో, ఛానళ్ళలో, ఎఫ్ ఎం రేడియోలలో ఎటువంటి భాషాప్రయోగాలు జరుగుతున్నాయో అవి మంచివైనా, చెడ్డవైనా ఈ సమయంలో చర్చించుకుందామని భావించాం. అదే సమయంలో ఇది వరకు జరిగిన మంచి కృషి గాని, భాషా నిర్మాణం గాని... ఉదాహరణలతో వివరిస్తే అది ఆనందదాయకం ఉంటుంది. అలాగే ఆ రంగంలో కృషి చేసే వారికి స్ఫూర్తిదాయకమవుతుంది. అయితే, ఈ ప్రయత్నం ఏ పత్రికలో, ఏ ఛానళ్ళలో జరిగిందో వివరాలు చెబుతూనే... అవసరమైన చోట తేదీ, సమయంతో పాటు కార్యక్రమం లేదా శీర్షికకు సంబంధించిన వివరాలు కూడా జోడిస్తే ఆయా మాధ్యమాలకు దోహదకారి అవుతుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|