|
|
Articles: My Thoughts | జనమాధ్యమాల్లో తెలుగు - Site Administrator
| |
నిజానికి ఇటువంటి ప్రయత్నం పెద్ద పత్రికలు చేసి ఉండాల్సింది. కానీ ఆ దిశగా తెలుగులో సరైన ప్రయత్నాలు జరగడం లేదని మేము భావించి, ఈ శీర్షికను ప్రారంభిస్తున్నాం. ఇందులో సుప్రసిద్ధ రచయితలతో పాటు ఔత్సాహిక పాఠకులు, వీక్షకులు, శ్రోతలు పాల్గొనవచ్చు. అయితే సమస్య ఏమిటంటే భాష తీరును చర్చించుకునే సమయంలో అప్రయత్నంగా వస్తువులోకి జారిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని గమనించి మీరు పరిశీలించిన భాషా విషయాల్ని ఈ వేదిక ద్వారా పంచుకోవచ్చు. మీ ప్రయత్నం తప్పకుండా సింహావలోకనానికి దోహదపడవచ్చు. అదే సమయంలో అది మరిన్ని మంచి ప్రయోగాలకు నాంది కావచ్చు.
గణితంలో విశేష ఆనందాన్ని పొందుతూ, సాహిత్యంలో రాణించి, అలాగే సంప్రదాయ సాహిత్యాన్ని తృణీకరించకుండా తెలుగు సాహితికి కొత్త పాళీని జోడించడమే కాక, తెలుగు పత్రికలకు, తెలుగు సినిమాకు జనవాణిని స్థిరపరచిన తాపీ ధర్మారావు పేరున ఈ శీర్షిక కొనసాగుతుంది. మరి మిత్రులారా జనమాధ్యమాల్లో తెలుగు తీరు తెన్నులు గురించి స్పందించండి! జనమాధ్యమాలు తమను తాము తెలుసుకునే రీతిలో ప్రయత్నించండి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|