|
|
Articles: Short Stories | విధ్వంసం - Mr. Pratap Cherukuri Pratap
| |
అనుకున్న విధంగా రాత్రి, పగలు కష్ట పడి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసాడు ఖలీద్. తనకు అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చిన కరీం భాయి కు ఆ ప్లన్ కాపీని అందజేసాడు. ఇరవై నాలుగు గంటల్లో అమీనుల్లా నుండి అప్రూవల్ లభించింది. రెట్టించిన ఉత్సహంతో ఒక విదేశీ ఏజెంట్ ద్వారా ఎక్స్ ప్లోసివ్స్ ను సంపాదించి , భాగ్యనగరం శివార్లలో ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో వున్న కరీం భాయి ఇంట్లో మూడు రోజులు అత్యంత శ్రద్ధతో పనిచేసి బాంబులను అసెంబుల్ చేసాడు ఖలీద్. ఆకర్షణీయంగా, టెడీ బేర్ లాంటి బొమ్మలతో, టిఫిన్ కారియర్, రేడియో, వి సిడి ప్లేయర్, మొబైల్ ఫోన్ లలో అతి నైపుణ్యం గా అమర్చాడు. వాటిని రెండు వందల మీటర్ల దూరం నుండి సెల్ ఫొన్ లా వుండే రీమొట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చెయ్యవచ్చు.
తను ప్లాన్ చేసిన ఆ విధ్వంసకర రోజు రానే వచ్చింది. ఆ రోజు సోమవారం. శెలవు తర్వాత స్కూలు, కాలేజీలకు వెళ్ళే విద్యార్ధులతోనూ, ఉద్యోగాలకు వెళ్ళే వారితోనూ, వ్యాపారస్థులతోనూ అతి సందడిగా వుండే నగరపు నాలుగు ప్రాంతాలలో వాటిని అమర్చాడు ఖలీద్. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రెండు కిలోమీటర్లు వుండేలా ప్లాన్ చేసుకున్నాడు. పది గంటల సమయం నుండి తన ఆపరేషన్ ప్రారంభించాడు. అరగంట వ్యవధిలో నగరంలో నాలుగు ప్రదేశాలలో బాంబులను పేల్చాడు. బాంబులు చాలా శక్తివంతమైనవి కావడాన్న విధ్వంసం బాగా జరిగింది. మరణించిన వారితో, తీవ్రంగా గాయాలైన వారితో ఆ ప్రదేసాలు రక్త సికమై పోయాయి. ఆంధ్ర రాష్ట్రానికి గుండెకాయ వంటి భాగ్యనగరం క్షత్రగాత్రుల ఆర్తనాదాలతో మార్మోగిపోయింది. పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడి రంగంలోకి దిగింది.
తన పనిని సురక్షితం గా ఎవరి కంటా పడకుండా పూర్తి చేసిన ఖలీద్ వెంటనే కరీం భాయితో కలిసి ఆ మధ్యాహ్నం విమానం లోనే బొంబాయి వెళ్ళిపోయాడు. విమానం లో కూర్చున్న తర్వాత భార్యకు ఫోన్ చేద్దామని ఎంతగానో ప్రయత్నించడు కాని భార్య సెల్ రింగ్ అవుతొంది కాని ఎత్తడం లేదు. బాబును స్కూలులో దీంచి వచ్చే టైము కాబట్టి బహుశా తొందరలో ఇంట్లో సెల్ మరిచిపోయి వెళ్ళి వుంటుందనుకొని, బొంబాయి చేరాక ఫోన్ చెయ్యవచ్చని సెల్ ఆఫ్ చేసేసాడు. బొంబాయిలో కార్ ఘర్ లో తన స్నేహితుడి ఇంట్లో కరీంతో సహా దిగడు. అక్కడే టి వి లో హైదరాబాద్ లో ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం పడ్తున్న హడావిడి, జరిగిన విధ్వంసకాడ గురించి మీడియాలో వస్తున్న వార్తలను ట్రాక్ చేస్తునే వున్నాడు. భార్యను కాంటాక్ట్ చేద్దామనుకున్నాడు గాని పొరపాటున హైదెరాబాద్ కు వెళ్ళే కాల్స్ ను టాప్ చేసే ప్రమాదం వుంది కనుక ఆ ప్రయత్నం చేయవద్దని కరీం గట్టిగా హెచ్చరించినందున విరమించుకున్నాడు ఖలీద్.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|