|
|
Articles: Short Stories | విధ్వంసం - Mr. Pratap Cherukuri Pratap
| |
సాయంత్రం అయిదు గంటలౌతోంది. కొడుకును స్కూలు నుండి మోటార్ బైక్ పై ఇంటికి తీసుకువెళ్లుతున్నాడు ఖలీద్. ఆ సమయం లో హైదరాబాద్ నగరం రోడ్లన్నీ ఎంతో బిజీగా వుంటాయి. స్కూల్స్ నుండి ఇంటికి వెళ్ళే విద్యార్ధులతో, ఆఫీసుల నుండి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులతో పీక్ ట్రాఫిక్ వుండే సమయం అది. ఎంతో ట్రాఫిక్ వున్నప్పటికీ తమ మోటార్ బైక్ ను ఎంతో చాకచక్యంగా నడుపుతున్నాడు ఖలీద్. అతను వుండేది అమీర్ పేట్ ప్రాంతంలో. కొడుకు చదువుతున్న స్కూలు సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర వుంది.ఇంతలో జేబులో వున్న సెల్ ఫోన్ వైబ్రేషన్ మోడ్ లో మ్రోగింది. అతి లాఘవంగా ఒక చేత్తో బైక్ ను బేలన్స్ చేస్తూ రెండో చేత్తో సెల్ ఫోన్ అందుకున్నాడు. అందులోని నెంబరు చూసి అతని కళ్ళు ఆనందంతో విప్పారాయి. దుబాయ్ నెంబరు అది. దుబాయ్ లో వున్న తన బాస్ సుమారుగా రెండు నెలల తర్వాత ఫోన్ చెసాడంటే అది పెద్ద పనే అయ్యుంటుంది. సెల్ కట్ చేసి రెట్టించిన ఉత్సాహంతో బైక్ ను మరింత వేగంగా నడిపి పది నిమిషాలలో ఇల్లు చేరుకున్నాడు. భార్య అమీనా చిరునవ్వుతో ఎదురు వచ్చి టీ కప్పు అందించింది. కప్పు నందుకొని ఒక్క గుటకలో టీ అంతటినీ తాగేసి తన లివింగ్ రూములోనికి వెళ్ళి తలుపేసుకొని సెల్ ఫోన్ లోని సిం కార్డును మార్చేసి ఇందాకటి నెంబరు చక చక డయల్ చేసాడు.
'హల్లో! ఖలీద్ ఎలా వున్నావు? అట్నుంచి ఆప్యాయంగా పలకరించాడు అమీనుల్లా.
'మీ దయ వలన బాగానే వున్నాను సార్. క్రిందటిసారి కాంట్రాక్ట్ వలన బాగానే మిగిలింది సాహెబ్' అతి వినయంగా జవాబిచ్చాడు ఖలీద్.
'ఈసారి అంత కంటే మంచి కాంట్రాక్ట్ మా హెడ్ ఆఫీసు నుండి వచ్చింది. హైదరాబాద్ లో నాలుగు ప్రదేశాలలో బాంబ్ బ్లాస్టింగ్ చెయ్యాలి. ప్రాణ నష్టం కనీసం రెండు వందలు వుండాలి. ఎలా ప్లాన్ చేస్తావో నీ ఇష్టం. కాంట్రాక్ట్ మొత్తం యాభై లక్షలు. అడ్వాన్స్ కింద ఇరవై లక్షలు నాలుగు రోజులలో నీకు అందే ఏర్పాటు చేస్తాను. ఒకే ?' అతి క్లుప్తం గా చెప్పాడు అమీనుల్లా.
'ఒకే సార్. థాంక్యూ వెరీ మచ్. ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ అయ్యేలా చూసే బాధ్యత నాది. డిటేయిల్స్ మొత్తం వర్కవుట్ చేసి మీకు ఫోన్ చెస్తాను' చెప్పాడు ఖలీద్.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|