|
|
Articles: Short Stories | కోరిక - Mr. Devender Chintala Devender
| |
'సత్యా! చిత్రమైన కోరిక కోరుతున్నావు. దేవతలకి సంసారం సంతానం ఉండదు. అది కేవలం పశువులకి, మానవులకి మాత్రమే’ అంటూ ఊరడించసాగాడు గోవిందుడు ఇష్టసఖి సత్యని.
సత్యభామ ఎన్నో రోజులుగా మాధవుణ్ణి తనకు సుతుణ్ణి ప్రసాదించమని వేడుకోసాగింది. ఏదో నెపంతో కాదూ కూడదూ అంటూ ఏవేవో నెపాల్ని సత్యభామకి చెప్పుకొస్తున్నాడు శ్రీకృష్ణుడు.
సత్య మొండికేసింది తనకూ సంతానం కావాలని. వాడి బాల్యచేష్టల్ని చూస్తూ వేడుక చేసుకోవాలని ఆశపడ్తోంది.
ససేమిరా కూడదన్నాడు మాధవుడు. బెట్టు చేసింది సత్య. సంతానమనేది ఒక మాయ అని అందులో చిక్కుకుంటే బయట పడడం కష్టమని. చివరికి తనని సైతం పట్టించుకోవని ఎంతగానో చెప్పిచూశాడు గోవిందుడు.
బాబు కావాల్సిందే అని మొండికేసింది సత్య. సరే నీ ఇష్టమంటూ సంతాన ప్రాప్తి కల్గించాడు మాధవుడు. సంబరపడిపోయింది సత్యభామ.
బృందావనమంతా ఆనందమయమైపోయింది. సత్య తన బాబుని తోటలు, వనాలు తిప్పి తనూ ఆనందడోలికల్లొ తేలియాడసాగింది. ఇప్పుడు సత్యకి తన బాబే ప్రపంచమైపోయింది. నివ్వెరపోసాగాడు కృష్ణుడు సత్య సంతోషాన్ని చూసి. తన ఉనికిని సైతం గుర్తించే స్థితి, స్థాయిలో లేదు సత్య. నవ్వుకున్నాడు.
క్షణికమైన సంబరానికి సత్యే ఓ ఉదాహరణ అనుకున్నాడు గోవిందుడు.
దినదిన ప్రవర్ధనమానమన్నట్టుగా బాబు పెరిగి పెద్ద అవుతున్నాడు. బాబుకి తనకిష్టమైన పేరు కృపుడని నామకరణం సైతం చేసింది సత్య. ఎల్లవేళలా తన బాబు పేరైన కృపనామమే జపమైంది సత్యకి. కృష్ణుడి సంగతే మరచిపోయింది.
రోజులు సంవత్సరాలౌవుతున్నా తన బాబే లోకమని భావిస్తున్న సత్య లోక రక్షకుడైన కృష్ణుడిని కనీసం తలవడం కూడా లేదు.
మెల్లిగా మాధవుడు దూరమవుతున్న సంగతి సైతం సత్య మరచిపోయింది.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|