TeluguPeople
  are the trend-setters
Videos
Cinema Gallery
News in Pix
Events and Parties
Sports
Travel / Leisure


Commissioning of Frigate INS Taragiri

Cape Size Bulk Carrier at Vizag port

AP MPS meet President Droupadi Murmu

HUDCO two day workshop on UiWIN

Nara Lokesh with Palla and Ganta
 
Articles: TP Features
అలెగ్జాండరే కుమారస్వామి!
- Site Administrator
  Page: 1 of 6   Next > >  
(డా. జి.వి. పూర్ణచందు) ప్రపంచ చరిత్రలో భారతదేశానికి సంబంధించిన విశేషాలు అలెగ్జాండర్ కారణంగా చాలా తెలుస్తున్నాయి. గ్రీకులు రికార్డు చేసిన ఆనాటి చారిత్రక అంశాలే ముఖ్యమైన చారిత్రక ఆధారాలుగా ఉన్నాయి. మన గురించి మనం రాసుకున్న చరిత్ర అంతా మతపరమైన అంశాలతో ముడిపడిపోయింది. చరిత్ర సృష్టించిన కథానాయకులు దేవుళ్ళుగానో, పురాణ పురుషులుగానో మారిపోయారు. పురాణ కథలు వాళ్ళ చుట్టూ అల్లుకుపోయి అసలు చరిత్ర మరుగున పడిపోయింది. ఇప్పటివరకూ అలెగ్జాండర్ చారిత్రక పురుషుడే. కానీ, తమిళులు అతన్ని పురాణ పురుషుణ్ణి చేసి, అతని పురాణంలో తమనీ, తమ తమిళ భాషనీ భాగస్వాముల్ని చేసి ఒక `వింతకథ'ని ప్రచారంలో పెడుతున్నారు. అలెగ్జాండర్ ఇండియాని జయించి పాలించాడని పాశ్చాత్య చరిత్రకారులు కూడా గట్టిగా నొక్కి చెప్పలేదు. కానీ అలెగ్జాండర్ భారతదేశాన్ని జయించాడని కొందరు భారతీయులే ఎక్కువగా నమ్మి ప్రచారం చేస్తుండటం ఆశ్చర్యం కల్గిస్తుంది! 1937లో ఆలిండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్ లో ఎస్.గోపాలపిళ్ళె, ఎం.ఎ., సమర్పించిన ఒక పరిశోధనా పత్రాన్ని (ఆలిండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ Vol IX - త్రివేండ్రం గవర్నమెంట్ ప్రెస్ - 1937, pp.955-997) బైటకు తీసి, దానికి మరికొన్ని మషాలాలు జోడించి, ఆ వ్యాసాన్ని ఇంటర్నెట్ లో పెట్టి దానికి పెద్ద ప్రాచుర్యం కల్పించారు. ప్రపంచ చరిత్రని తమిళులు ఎలా వక్రీకరిస్తారో, తమకు అనుకూలంగా చరిత్రని ఎలా మలచుకోగలుగుతారో ఈ వ్యాసాన్ని చదివితే ఎవరికైనా అర్థం అవుతుంది. ఈ వ్యాసంలోని ముఖ్యాంశాలను తెలుగుపాఠకుల దృష్టికి తీసుకువస్తున్నాను. మొదట వాటిని పరిశీలిద్దాం. - అలెగ్జాండర్ పురుషోత్తముణ్ణి, ఇతర భారతీయ రాజుల్ని అవమానించి, ఇండియాని జయించి, ఈ దేశాన్ని తన గుప్పెటలో పెట్టుకున్నాడు. - అలెగ్జాండర్ మహానుభావుడు. కారణజన్ముడు, అవతార పురుషుడు. అతను ఏ దేశాన్ని జయించినా, అక్కడి ప్రజల్ని, వాళ్ళ సంస్కృతిని, వారి మత విశ్వాసాలను గౌరవించాడు. - పర్షియన్ల పట్ల తీవ్ర శత్రుత్వం కారణంగా వారి మతగ్రంథాలను విధ్వంసం చేయించాడు. ఇలాంటివి ఒకటీ రెండు ఉదారహణలు మాత్రం చాలా అరుదుగా జరిగాయి.

Read 4 Comment(s) posted so far on this Article!

  Page: 1 of 6   Next > >  



News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2026 TeluguPeople.com, All Rights Reserved.

 
SAS Training