|
| | venugopal suryadevara http://www.telugupeople.com/profiles/suryadevaravenugopal
| venugopal suryadevara wrote at: 13, May 2018 1:15:57 AM నవగ్రహ దోష నివారణకు వాల్మీకి రామాయణం లోని సుందరకాండ కల్పతరువు గా చెప్పబడింది. మానవ జీవితం లోని వివిధ సమస్యల నివారణకు శ్రీ సుందరకాండ పారాయణం గొప్ప నివారణ గా మన పూర్వీకులు సూచించారు. ఇప్పటికీ మన హిందూ సంస్కృతి లో సుందరకాండకు విశేష మైన ప్రాముఖ్యత ఉంది. అనేక ఆపద నివారణకు సుందరకాండ పారాయణం దివ్యఔషధం గా అనేక పూర్వ గ్రంధాలు, మహర్షులు చెప్పడం జరిగింది. ఇప్పటికీ అనేకులు ఈ దివ్య మైన సుందర కాండ ను ఒక నిర్దుష్టమైన పద్దతిలో పారాయణం చేసి అనేక సమస్యల నుండి విముక్తిని పొందుతున్నారు.
సుందర కాండను ఏ విధంగా పారాయణం చేయాలి, ఏ సమస్యకు ఏ సర్గను పారాయణం చేయాలి అనే విషయాలను తెలుసుకొని పారాయణం చేస్తే అనేక మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఏ సమస్యకు ఏ సర్గ పారాయణం చేయాలో తెలుసుకుందాం.....
భూత ప్రేత భయ నివారణకు అనేక మానసిక ఆరోగ్య సమస్యలకు సుందరకాండ లోని 3 వ సర్గ "లంక విజయం" ను 40 రోజుల పాటు పారాయణం చేయాలి.
సంపద వృద్దికి అనేక ఆర్ధిక సమస్యల నివారణకు 15 వ సర్గ "లంకలో సీతాదేవి దర్శనం" ను 40 రోజుల పాటు పారాయణం చేయాలి.
పీడకలలు అనేక భయ నివారణకు 27 వ సర్గ " త్రిజట స్వప్నం" ను 21 రోజుల పాటు పారాయణం చేయాలి
| | Login to post your comments / feedback! Login Box is below... |
Login to Start connecting with venugopal and over a Million other Telugu people world-wide!
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|
|
|
(C) 2000-2023 TeluguPeople.com, All Rights Reserved.
|
|
|