ఉచిత మద్యం కూపన్లు
'కొన్ని రాజకీయ పార్టీలు ముందుగానే మద్యం దుకాణాలతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఆ ప్రాంతంలో పేరొందిన నాయకుడు లేదా మద్యం దుకాణం యజమాని చీటీలపై సంతకం చేస్తుంటారు' అని పోలీస్ సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు. ఈ ఒక్క విధానం వల్లే దుకాణం యజమానికి లక్షలాది రూపాయలు ఖర్చవుతుంటాయని ఆయన తెలిపారు. చాలా మంది మద్యం దుకాణం యజమానులకు తమతో అనుబంధం గల రాజకీయ పార్టీకి 'విరాళం' ఇవ్వడానికి ఇది ఒక మార్గం. పెద్ద ఎత్తున మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని నిందితులను నిర్బంధంలోకి తీసుకోవడానిక వేచి చూస్తుండే పోలీసులు జనం రెండేసి మద్యం సీసాలు తీసుకువెళుతూ సందుగొందులలో అదృశ్యం అవుతుంటే ఏమీ చేయలేకపోతున్నారు.
అయితే, ఇలా జరుగుతున్నది మద్యం సీసాల విషయంలో మాత్రమే కాదు. కొద్ది మొత్తంలో డబ్బును కూడా ఇదే పద్ధతిలో పంపిణీ చేస్తున్నారు. 'చీటీలపై సంతకాలు చేసి ఉంటాయి. ఎంత డబ్బు ఇవ్వాలో రాసి ఉంటుంది. నగదు తీసుకోవలసి ఉన్న వ్యక్తిని నిర్దుష్టంగా ఒక దుకాణానికి లేదా సంస్థ వద్దకు, లేదా కార్యాలయానికి వెళ్ళి ఆ చీటీని అందజేయవలసిందని కోరతారు. అతనికి డబ్బు అందుతుంది' అని కొందరు ప్రతినిధులు వివరించారు. అలా ఇచ్చే నగదు రూ. 25 నుంచి రూ. 30 వేల మధ్య ఉంటుందని వారు తెలిపారు. 'ఇటువంటి వారు వందలాది మంది ఉన్నారు. ఈ చిన్న మొత్తాలు తీసుకువెళ్ళే వారిని ఎంత మందిని మేము పట్టుకోగలం' అని పోలీస్ అధికారులు అడుగుతున్నారు. 'ఏదో పెద్ద చేప' దొరకకపోతుందా అనే ఆశతో పోలీసులు ఈ యువకులు అనేక మంది వెంట పడుతున్నారు.
Pages: -1- 2 News Posted: 12 April, 2009
|