ప్రభుత్వానికి చిరు 'చెక్'
ప్రజల బాగోగులను రాష్ట్రంలోని ఏ పార్టీ కూడా పట్టించుకోవడం లేదని చిరంజీవి వ్యాఖ్యానించినప్పుడు కాంగ్రెస్ సభ్యులు ఆయన ప్రసంగానికి నిరసన తెలిపారు. కాంగ్రెస్ సభ్యులను వారించేందుకు స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి యత్నించినప్పుడు చిరంజీవి కల్పించుకొని 'కాలేజీలో చేరినప్పుడు సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేయడం మామూలైందని, అలాగే అసెంబ్లీలో సీనియర్ల ర్యాగింగ్ కు తాను సిద్ధంగా ఉన్నానం'టూ చిరంజీ చమత్కరించారు. ర్యాగింగ్ ను ప్రభుత్వం నిషేధించిందని స్పీకర్ అన్నప్పుడు అదెక్కడ అమలవుతోందని చిరంజీవి నవ్వుతూ ప్రశ్నించారు. విద్యా వ్యవస్థను మరింతగా ప్రక్షాళన చేయాలని చిరంజీవి సూచించారు. విచ్చలవిడిగా రేషన్ కార్డులు మంజూరు చేసి ఇప్పుడు బోగస్ కార్డుల పేరిట పేదలను ఇబ్బందులు పెట్టవద్దని చిరంజీవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
జలయజ్ఞం పేరుతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొన్నదన్న చిరంజీవి వాటిని సత్వరం పూర్తి చేసేందుకు వైఎస్ సర్కార్ నడుంబిగించాలని కోరారు. మహిళలకు భద్రత లేకుండాపోయిన ఈ తరుణంలో ఓ మహిళను హోంమంత్రి పదవికి ఎంపిక చేయడం ముదావహం అన్నారు. మహిళల సమస్యలపై హోంమంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి వెంటనే స్పందించాలని చిరంజీవి సూచించారు.
Pages: -1- 2 News Posted: 10 June, 2009
|