రాట్నం పట్టిన బాబు
హైదరాబాద్ : చేనేత కార్మికుల సమస్యల సమస్యలపై ప్రభుత్వం స్పందించడంలేదని నిరసన వ్యక్తం చేస్తూ తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం పార్టీల ఎమ్మెల్యేలు రాట్నాలు, చేనేత మగ్గాలను భుజాన పెట్టుకొని అసెంబ్లీకి ర్యాలీగా వచ్చారు. అంతకు ముందు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద ఈ మూడు పార్టీల సభ్యులు రాట్నంపై నూలు వడుకుతూ, మగ్గంపై వస్త్రం నేస్తూ నిరసన తెలిపారు.
గన్ పార్క్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించేవరకూ తాము పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. చేనేత కార్మికుల పరిస్థితి అంతకంతకూ దారుణంగా మారిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాజా బడ్జెట్ ప్రతిపాదనల్లోను, అంతకు ముందరి రెండు వార్షిక బడ్జెట్లలో కూడా ప్రభుత్వం చేనేత కార్మికులకు కేటాయింపులు జరిగినా వాటిని సక్రమంగా వినియోగించలేదన్నారు. చేతిలో పని లేక, ఉన్నా వాటిని మార్కెట్ చేసుకొని పరిస్థితి లేక చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా కాంగ్రెస్ సర్కార్ కు చీమ కుట్టినట్లయినా లేదని చంద్రబాబు నిప్పులు చెరిగారు.
Be first to comment on this News / Article!
|