'ఎఫ్' టీవీపై బ్యాన్ న్యూఢిల్లీ : ఫ్యాషన్ టెలివిజన్(ఎఫ్ టీవీ)పై కేంద్ర ప్రభుత్వం మళ్లీ కొరడా ఝుళిపించింది. ఆ ఛానల్ ప్రసారాలను దేశంలో తొమ్మిది రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. అర్థరాత్రి సమయంలో మోడల్స్ నగ్న దృశ్యాలను ఎఫ్ ఛానల్ ప్రసారం చేసిందని, అందుకే తాము చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ఎప్ టీవీపై గురువారం నుండి మార్చి 21 తేదీ వరకు దేశంలో నిషేధం అమలులో ఉంటుందని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు వివరించారు.
సెప్టెంబర్ మాసంలో ప్రసారం చేసిన ఓ ప్రొగ్రామ్ లో కొందురు మోడళ్లు నగ్న దృశ్యాలు ప్రాసారం చేసింనదునే తామీ చర్య తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. భారత్ తీసుకున్న నిర్ణయంపై ఎఫ్ ఛానల్ ఇంకా ఎటువంటి స్పందన తెలియచేలేదని చెప్పారు. వియన్నా కేంద్రంగా ప్రసారాలు సాగిస్తుండటంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇంకా యాజమాన్యానికి చేరాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే ఛానల్ గతంలో కూడా భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. 'మిడ్ నైట్ 'హాట్ పేరిట అసభ్యకరమైన దృశ్యాలు ప్రసారం చేసినందుకు గాను 2007లో 60 రోజుల పాటు నిషేధం విథించారు. కాగా మళ్లీ ఇప్పుడు మోడళ్ల అర్థనగ్న దృశ్యాలు ప్రసారం చేయడంతో మరోసారి నిషేధానికి గురైంది ఎఫ్ టీవీ.
News Posted: 11 March, 2010
|