వెండితెరపై ఇన్ఫీ సుధా మూర్తి బెంగళూరు : ప్రముఖ ఐటి సంస్థ ఇన్ఫోసిస్ పిల్లర్ ఇన్ఫీ నారాయణమూర్తి సతీమణి సుధా మూర్తి త్వరలో వెండితెరపై కనిపించనున్నారు. ఆమె కన్నడంలో ఓ చిత్రంలో తన నటనా కౌశలాన్ని ప్రదర్శించనున్నారు. ఈ చిత్రంలో ప్రసిద్ధ కన్నడ నటుడు అనంతనాగ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సుధా మూర్తి మంచి రచయిత్రిగా కూడా పేరెన్నికగన్నారు. కన్నడ సంస్కృతి, భాష పరిరక్షణ అవసరంపై సీనియర్ జర్నలిస్టు కె.సదాశివ్ షనాయ్ నిర్మిస్తున్న 'ప్రార్థనే' సినిమాలు సుధా మూర్తి కనిపించనున్నారు. కాగా, ఎలాంటి మేకప్ అవసరం లేని సహజసిద్ధమైన పాత్రలోనే సుధా మూర్తి ఎంచుకున్నారు. గతంలో ఆమె బుల్లితెరంగేట్రం కూడా చేసిన అనుభవం ఉంది. టీవీలో సుధా మూర్తి ఓ సీరియల్ లో నటించారు. కన్నడ సంస్కృతీ, సంప్రదాయాలను పరిరక్షించడం ఇతివృత్తంగా సాగే సినిమాలో నటించడం సంతోషంగా ఉందని సుధా మూర్తి వ్యాఖ్యానించారు.
News Posted: 11 March, 2010
|