బాబు నోరు విప్పాలి:కోదండం హైదరాబాదు : ఉద్దేశపూర్వకంగా టీడీపీని జేఏసీ నుంచి బహిష్కరించలేదని, ఆ పార్టీ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని జెఏసి కన్వీనర్ కోదండరామ్ అన్నారు. తెలుగు దేశం పార్టీ రాజీనామాలు ఎందుకు చేయలేదో చెప్పాలని, చంద్రబాబు నాయుడు తెలంగాణపై స్ఫష్టమైన వైఖరిని ప్రకటించాలని, న్యాయవాదులపై దాడులకు టీడీపీ క్షమాపణ ఎందుకు చెప్పలేదని కోదండరామ్ ప్రశ్నించారు. ఈ మూడు కారణాల వల్లే టీడీపీని జేఏసీ నుంచి బహిష్కరించినట్లు ఆయన వెల్లడించారు.
ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజాప్రతినిధులు నడుచుకోవాలని, ఇవాళ జేఏసీ ప్రజల చేతుల్లో నడుస్తోందని కోదండరామ్ స్ఫష్టం చేశారు. కేసీఆర్, విజయశాంతిలు వ్యూహాత్మకంగా తమ రాజీనామాలను వాయిదా వేసుకున్నారు తప్ప వెనక్కి తగ్గలేదని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీలో సభ్యులుగా ఉన్నవారు కూడా తమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదని, దీనివల్ల ప్రజలకు కమిటీపై నమ్మకం సన్నగిల్లుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
News Posted: 13 March, 2010
|