అప్పుడు అసలు సంగతి చెప్పింది శ్రీదేవి. ఈ సంబంధం వచ్చినప్పుడు శోభనరావుకు వున్న వెర్రి గురించి ఎవిఎస్ తో వివరంగా చెప్పాడు బ్రహ్మానందం. అందరూ కలిసి ఐరెన్ లెగ్ శాస్త్రిని సంప్రదించి ఒక ప్లాను వేసారు. పెళ్ళి చూపుల రోజున సిగ్గు మిషతో కెర్టెన్ వెనక్కి పంపించి శ్రీదేవి ఫ్రెండు, పాటలను బాగా పాడగల గీత తో ఆ పాట పాడించారు. ఆ రోజు నుండే గీత దగ్గర పాటలను నేర్చుకునే ప్రక్రియ కూడా మొదలుపెట్టింది శ్రీదేవి. ఒక మూడు నాలుగు సంవత్సరాలలో పాటలను నేర్చుకొని శోభనరావు కోరికను తీర్చగలనని ధృఢం గా చెప్పింది.
`జరిగిన విషయాన్ని విన్న శోభనరావుకు తల గిర్రున తిరిగి మైండు బ్లాకయినట్లనిపించింది. పదిహేనేళ్ళుగా కట్టుకున్న ఆశలసౌధం ఒక్కసారిగా కూలిపోయినట్లనిపించింది. అచేతనుడై శిలలా వుండిపోగా, బంగారం లాంటి తొలిరేయిని హాయిగా ఆస్వాదించక ఆ దిక్కుమాలిన పాటల గురించి ఆలోచన ఎందుకండి' అంటూ అతనిని అల్లుకుపోయింది శ్రీదేవి. మరునిమిషం లోనే స్త్రీ స్పర్శ తగలగానే ఫాం లోకి వచ్చేసాడు శోభనరావు. జరిగే తంతుని చూడలేక చంద్రుడు సిగ్గుతో కళ్ళు మూసుకున్నాడు.
|