Active Blogs | Popular Blogs | Recent Blogs మాతృమూర్తికి వందనం!
పల్లవి:
మాతృమూర్తికి వందనం
మహితాత్మకిదె మా వందనం
విశ్వమంతా విస్తరిల్లిన
మహిళ కీర్తికి వందనం
ఆ - మమతకిదె అభినందనం!
చరణం-1:
ఆకసంలో సగము తానని,
నిశ్చయమ్మీ యుగము తనదని
రోదసిలొ పయనించి చాటిన
'కల్పన'కిదే వందనం -
స్త్రీ శక్తికిదె అభినందనం
చరణం-2:
నిర్మల హృదయమ్మె తోడుగ
దీనజనులకు తానె నీడగ
శాంతి, ప్రేమలు పంచి యిచ్చిన
'మదరు'కిదె మా వందనం
స్త్రీ కరుణకిదె అభినందనం
చరణం-3:
సప్త స్వరముల వాణియై
సంగీత భారత రత్నమై
భక్తిభావన పెంపు చేసిన
సుబ్బలక్ష్మికి వందనం
స్త్రీ-సంస్కృతికి అభినందనం
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|