Active Blogs | Popular Blogs | Recent Blogs హోరుహోరుమని కారు కూతలు,
కడుపులో తిప్పెట్టు లారీ శబ్దాలు
బుర్రుబుర్రుమని స్కూటర్ పరుగులు,
చిత్తమోచ్చినట్టు నడిపే ఆటో వాళ్ళు
ఎటువైపు చూసినా ట్రాఫిక్ జాంలు,
కళ్ళు కనిపించకుండా పొగ వదిలే బళ్ళు
సాటి మనిషి గురించి చింతెలేదంటే,
ఆ నిజం నువ్వు నమ్మగలవా నేస్తం
మన ప్రాణాలకు భారోసాలేదంటే,
సమాజం ఎటు వెళ్తోందో గమనించావా నేస్తం
ప్రతి వీధిలోనూ అనాధ పిల్లలు,
సిగ్నల్ దగ్గర చేయి చాపే రేపటి పౌరులు
తిండి లేక అల్లాడే బాలురు,
జీవంలేని బ్రతుకీడ్చే జీవచ్చవాలు
తల్లి ప్రేమ చవిచూడని పిల్లలున్నారంటే,
ఆ నిజం నువ్వు నమ్మగలవా నేస్తం
పిల్లల్ని వీధిపాల్జేసే తల్లులున్నారంటే,
సమాజం ఎటు వెళ్తోందో గమనించావా నేస్తం
ఈనాటి పిల్లలు మన భావిపౌరులు,
టీవీని చూసి చెడిపోతున్నారు
చిన్నపిల్లలకు డబ్ల్యూడబ్ల్యూఈలు,
కాలేజి ఏజికి బూతు సినిమాలు
ఇంట్లో చెప్పే మాటలు పడవు,
బడిలో చెప్పే పాఠాలు వినరు
కనీ వినీ ఎరుగని మాటలు వాళ్ళ నోట వస్తుంటే,
ఆ నిజం నువ్వు నమ్మగలవా నేస్తం
తల్లీ తండ్రి ఏమీచేయలేని పరీస్తితి వచ్చిందంటే,
సమాజం ఎటు వెళ్తోందో గమనించావా నేస్తం
వీదిలోక్కొస్తే ప్రేమపిచ్చోళ్ళ స్వైరవిహారం,
వేధింపులకు గురవ్వడం అమ్మాయిల గ్రహచారం
ప్రేమ పేరుతొ పీడించడం ఈనాటి యువత ఆచారం,
కాదంటే ఓ కసాయిగా వాడు మారడం ఖచ్చితం
వద్దంటే ఆ అమ్మాయి పేరు దుష్ప్రచారం,
లేదంటే తన ప్రాణాలు తను తీసుకోవడం నిశ్చితం
పవిత్ర ప్రేమను దిగజార్చిన మూర్ఖులున్నారు అంటే,
ఆ నిజం నువ్వు నమ్మగలవా నేస్తం
చదువుండి విలువలు లేని యువత మనదంటే,
సమాజం ఎటు వెళ్తోందో గమనించావా నేస్తం
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|