Active Blogs | Popular Blogs | Recent Blogs నా తనువులో వున్న పంచేంద్రియాలు
అవి చూసే చూపు బట్టి, వినే మాటలను బట్టి
తాకే స్పర్శను బట్టి, పీల్చే వాసను బట్టి
నడిచే నడతను బట్టి, చేసే చేతలను బట్టి
తేడాలను కనిపెట్టి, నా గమనాన్ని నిర్ధేశించగలవు ,
కాని
నిను వలచిన నామనసుకి ఈ తేడాలు తెలియదు ప్రియా ..దానికి
ఉక్రోశంతో కోపాన్ని చూపించినా,ఉల్లాసంతో తీయని మాటలు వినిపించినా
ఉద్రేకంతో నిలువునా అగ్నికి దహన మిచ్చినా,
వెచ్చని ఉపిరిలను యదపైకి ప్రవహింపచేసినా,
చేతిలో చేయి పట్టి ఉన్నత మార్గాలకు నడిపించినా
ఆ దారిలో ముల్లదారిని పట్టించినా
ప్రేమిచడం తప్ప ఏమి చేయలేని
మూగది, చెవిటిది
గుడ్డిది ,కదలలేని అవిటది................................
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|