Active Blogs | Popular Blogs | Recent Blogs రూపులేని ఆకారానికి రూపునిచ్చి,
ఆ రూపుకి నీ చేతనైన రంగులు దిద్ది
అవదిలేని ఆశలతో , ఉత్సాహపు హోరుగాలిలో
ఉహకందని శిఖరాలకు, నమ్మశక్యం లేని అంచులకు
నా గమనజివితపు గాలిపటాన్ని ఎగురవేసావు
నేడు నీకు అందని దూరాలకు ఎగిరిపోయానని,
ఈ జన్మకు నీ దరికి రానేరానని భావించి
కన్నీళ్ళ తడి ఎండిన కళ్ళతో,
యద చప్పుడు కూడా భాదిస్తుందన్న భావాలతో
సడి చప్పుడు లేకుండా,కనీసం నను చూడకుండా
చిరునామాలేని చోటులకు ఒంటరిగా దారులు వెతుకుతున్నావు
ఏకాకిలా మిగిలిపోవడానికి ఏకాంతగా దారులు వెతికే ఆ మనసుకి
ఒక్కసారి ఏకాంతగా ఒక ప్రశ్న అడుగు చెలియా
ఎగురవేసిన ఆ గాలిపటపు గుండె దారం ఎవరి కరం లో ఉందని,
అది విడిస్తే దాని బతుకు ఏమౌతుందని,
చివరకు తనకు ఏమి మిగులుతుందని ...
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|