Active Blogs | Popular Blogs | Recent Blogs ఎండిపోతున్న వాగుకి, రాలే చినుకులా
రాలిపోతున్న పువ్వుకి, వాలే తుమ్మదలా
వాలిపోతున్న పొద్దుకి, కురిసే వెన్నెలలా
కురుస్తున్న కుండబోత వానకి , నీడనిచ్చే గొడుగులా
నా హృదయం లోని ఆనందపుజల్లుని
నిరుత్సాహాపు ఎడారుల మద్య కురిపించి
వాడిపోతున్న ఆశకి వసంతపు పల్లకిని ఎక్కించి
చీకటి తెలియని దారుల్లో, నీ స్నేహమనే నీడతో
ఉహకందని ఉన్నతశిఖరాలకు సాగనంపావు
తీరేనా ఈ జన్మకు నీ ఋణం,కన్నీళ్ళతో నీ పాదాలు కడిగినా
తీరేనా ఈ జన్మకు నీ ఋణం,శిరస్సు వంచి ప్రణామాలు చేసినా ...
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|