Active Blogs | Popular Blogs | Recent Blogs " మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమిళ, కన్నడ, మరాఠీ, ఒరియా ప్రాంతాలు సరిహద్దులుగా వున్నాయి. ఈ ద్విభాషా ప్రాంతాల్లో ఆచార వ్యవహారాలు కొద్దిగానో, ఎక్కువగానో కలగాపులగం కావడం తప్పనిసరి ! తెలంగాణా తెలుగువారి మాటల్లో ఉర్దూ యాస తప్పదు. కన్నడులు బహుళంగా గుండప్పలు, నంజుండప్పలు గదా ! అందువల్ల బెంగుళూరు తెలుగు వాళ్ళు ' ఏమండప్పా ! రండప్పా ! కూచోండప్పా ! ' అంటారు. యావదాంధ్రంలోను చదువుల తల్లి సరస్వతీదేవి వున్న ఒకే ఒక ఆలయం ఆదిలాబాదు జిల్లాలో వుంది. అక్కడ ఆంధ్రులు తెలుగు కలిసిన మరాఠీతోను, మరాఠీ కలిసిన తెలుగుతోను మాట్లాడుకుంటారు. ఇటు అరకుగానీ, ఇచ్చాపురంగానీ వెళ్ళి చూడు. అక్కడ మన వాళ్ళ భాష తెలుగు ఒరియా కలిసిన మణిప్రవాళంలా వుంటుంది. ఆ మాట కొస్తే వివిధ సంస్కృతుల సమ్మేళనమే గదటయ్యా నేటి మానవ నాగరికత ! నువ్వానాడు తెలుగుభాష అనుకునేది ఏనాటి ఏయే భాషల మిశ్రమమో చెప్పగలవా ? అట్లాగే ఆచారాలూ వ్యవహారాలూ అన్నీ ! సంకరంగాని మతం, సంకరంగాని కులం, సంకరంగాని భాష ఈ ఇలాతలంపైన ఉన్నాయంటావా ? పోనీలే, ద్విభాషా ప్రాంతంలో నివసించే మేము అసలు తెలుగు వాళ్ళమైతే కాకపొవచ్చునుగానీ, మీకులేని సదుపాయం మాకొకటి వుంది. మాతృభాషతో బాటుగా మాకు మరొక దేశ భాష సునాయాసంగా అబ్బుతుంది. అందువల్ల మాకు విజయవాడ ఎంతో తంజావూరూ అంతే ! తల్లి కృష్ణమ్మ ఎంతో అన్నై కావేరీ అంతే ! విశ్వనాథ వారి ' వేయిపడగ ' లెంతో , కల్కి రచన ' శివగామియున్ శపథమూ ' అంతే ! నా కత్తికి రెండంచులూ పదునేనయ్యా ప్రసాదరావ్ ! నా భాగ్యం తక్కువైందేమీ కాదు. నిజానికి నన్ను చూసి అసూయ పడాలి నువ్వు ! "
.................. ఇక శిరాకదంబం
లో చదవండి. మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|