Active Blogs | Popular Blogs | Recent Blogs లైలా తుఫాను లీల ఈ రోజు సాయింత్రం వరకూ కొనసాగింది. ఇదే లైలా తుఫాను తిరిగి సముద్రంలోకి ప్రవేశించి ఒడిస్సా వైపు పయనించి మళ్ళీ తీరం తాకుతుందని, మరో తుఫాను ముప్పు పొంచి వుందని దానికి ' బంద్ ' అనే పేరు కూడా పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. నిన్న లైలా తీరం దాటిన విషయంలో కూడా అధికారుల మధ్య, మీడియాలోను గందరగోళం నెలకొంది. మధ్యాహ్నం రెండుగంటల ప్రాంతంలో బాపట్ల దగ్గర తీరం దాటినట్లు ఒక వార్తా ఛానల్ ప్రసారం చేస్తే కొన్ని చానెళ్ళు సందిగ్డంగానే ప్రకటించాయి. దానికి ముందు వరకూ మచిలీపట్టణం దగ్గర తీరం దాటే అవకాశం అధికంగా వుందని వార్తలు పదే పదే ప్రసారమయ్యాయి. ఆ ప్రాంతంలో ప్రజలకు సహాయం అవసరమవుతుందని వెళ్ళిన మాకు అక్కడ దాదాపుగా ప్రశాంత వాతావరణం ఎదురయ్యింది. అప్పుడప్పుడు కొద్దిగా గాలి, కొద్దిగా వర్షం మాత్రమే అక్కడ కనబడింది. గ్రామాలన్నీ అధికారులు ముందే ఖాళీ చేయించడంతో ప్రశాంతంగా వుంది. తుఫాను ముందు ప్రశాంతత ఏమో అనుకున్నాం. కాసేపటికి బాపట్ల దగ్గర తీరం దాటిందని, కాదు ఒంగోలు దగ్గర దాటిందని రకరకాల వార్తలు వచ్చాయి. దేశమంతా కలవరపడుతున్నా తుఫానులకు అలవాటు పడ్డ మచిలీపట్టణం ప్రజలు ఎప్పటిలాగే వాళ్ళ దైనందిన కార్యకలాపాల్లో మునిగిపోయున్నారు. తుఫాను గురించి వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదనిపించింది. ఆది నిజమేమో కూడా ! ప్రతి సంవత్సరం ఎదురయ్యే పరిస్థితి ఇది.
ఇంకా శిరాకదంబంలో చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|