Active Blogs | Popular Blogs | Recent Blogs అన్నీ తెలిసి నన్ను అడగకుండానే వెళ్లిపోయింది.
కను మరుగైంది కాలం కనిపించదు నీ మౌనం .
ఎన్నాళ్ళుగానో ఎదురు చూసాక కనిపించింది నీ రూపం.
నా పరుగు నిన్ను చేరే లోపే ఆగిపోయింది నా పాదం..విడిపోయింది మన స్నేహం .
అయినా నువ్వు వస్తావని ఇంకా ఎదురు చూస్తుంది నా వర్తమానం .
ఒడి చేరిన ఓ పసిపాపకి పాఠం నేర్పవు . నమ్మకం అనే హోదా కి వారసుడివయ్యావు.
కదలలేని కళ్ళలో కలవైనావు ..అడగలేని గొంతులో అరుపైనావు .
నీకు గుడి కట్టిందని తెలిసీ ..వేరొకరిని పూజించమన్నావు.
నీ స్నేహం మాత్రమే తెలిసిన తనని ప్రేమించమన్నావు. చేతకాని అమాయకత్వాన్ని మోసం అనమన్నావు.
దోషిని చేసి పొమ్మంటే ఊరుకున్నావు .
అన్నీ తెలిసి ...అడగకుండానే వెళ్ళిపోయావు .
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|